టాలీవుడ్ లో ఎవరు ఎప్పుడు శత్రువులుగా, మిత్రులుగా మారతారో చెప్పటం చాలా కష్టం. క్షణం వరకు మిత్రులుగా ఉన్న శత్రువులుగామారిన విషయం తెలిసిందే. అలాగే..బద్ద శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారిన సందర్భాలు ఉన్నాయి.అయితే గత రెండు రోజులునుండి టాలీవుడ్ విలన్, దర్శకు మద్య ఒక వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ విలన్, నటుడు ప్రకాష్ రాజ్ , ప్రమఖ దర్శకుడు మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని టాలీవుడ్ పుకార్లు పుట్టాయి.
టాలీవుడ్ లో తనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి కుట్ర పన్నుతున్నాడంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిన్న పేల్చిన బాంబు ప్రకంపనలు సృష్టించింది. ఆ 'ఒక్కడూ' ఎవరన్న విషయాన్ని ఆయన చెప్పకపోయినప్పటికీ, దర్శకుడు శ్రీను వైట్లను ఉద్దేశించే ఆయనలా కామెంట్ చేశాడనేది అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్యా గతంలో 'దూకుడు' సినిమా సమయంలో కూడా చిన్న చిన్న అభిప్రాయభేదాలు వచ్చినట్టు చెబుతున్నారు.
వాస్తవానికి ఇద్దరూ తమ తమ రంగంలో ప్రతిభావంతులే! అయితే, ఇద్దరూ ఈగో సమస్య పుష్కలంగా వున్నవాళ్ళే!
గతంలో తన బ్యాడ్ బిహేవియర్ తో ప్రకాష్ రాజ్ ఓసారి బాగా దెబ్బతిన్నాడు. అలాగే, శ్రీను వైట్లకు కూడా కోన వెంకట్, గోపీమోహన్, మరి కొందరు టెక్నీషియన్లతో గొడవలు జరిగాయి.
ఇలా... రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవన్నట్టు అక్కడే సమస్య మొదలైంది. 'ఇలా చేద్దామంటే, అలా చేద్దామంటూ' ఆగడు సెట్లో చిన్న చిన్నగా మొదలైన ఈగోలు పెరిగి పెద్దవై ముదిరిపోయాయి. దానికి తోడు ప్రకాష్ రాజ్ సెట్ కి ఆలస్యంగా రావడం ... 'ఆగడు' సినిమా కో డైరెక్టర్ సూర్యాపై నోరు పారేసుకోవడంతో ఇక వివాదం తార స్థాయికి చేరిపోయింది. దీంతో ప్రకాష్ రాజ్ ని ఆ సినిమా నుంచి తీసేయడం ... కో డైరెక్టర్ చేత దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేయించడం జరిగిపోయాయి.
తన పట్ల మహేష్ బాబుకి కానీ, నిర్మాతలకు కానీ ఎవరికీ ద్వేషం లేదనీ, చివరికి కంప్లైంట్ చేసిన సూర్యాకి కూడా లేదనీ, అయితే ఒక వ్యక్తి పనిగట్టుకుని ఇదంతా చేయిస్తున్నాడనీ ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. తనను నిషేధించారంటూ తనకు వ్యతిరేకంగా టాలీవుడ్ లో ఆ 'ఒక్కడు' ఎస్సెమ్మెస్ ల ప్రచారం కూడా చేయిస్తున్నాడని ఆరోపిస్తూ, త్వరలో అతని పేరు బయటపెడతానని ప్రకాష్ రాజ్ హెచ్చరించాడు. దీంతో ఈ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది.
ప్రకాష్ రాజ్ వెనుక కొందరు వ్యక్తులు వుండి, ఇలా చేయిస్తున్నారని శ్రీను వైట్ల భావిస్తున్నాడు. వ్యవహారం ఇక్కడి వరకు వచ్చాక తాను కూడా తాడో పేడో తెల్చుకుంటానంటూ సన్నిహితుల వద్ద ఈ దర్శకుడు ఆగ్రహంతో అంటున్నాట్లు తెలుస్తోంది. ఇద్దరు కళమాతల్లి బిడ్డలే కాబట్టి ఎందుకు గొడవలు, ఇద్దరు కలిసి మంచి సినిమాలు తీసారు. మళ్లీ ఇలా రోడ్డుపై పడటంతో బాగాలేదని.. టాలీవుడ్ పెద్దలు ఇద్దరికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. ఇది చివరకు ఎటువైపు దారి తీస్తుందో చూడాలని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more