తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే.. అభిమానులకు పెద్ద పండగే. ఆయన షూటింగ్ అంటే కూడా సినిమా షూటింగ్ సిబ్బంది చాలా ఆనందంగా ఉంటారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే రజనీ అభిమానులకు ఒక శుభవార్త. ఇప్పటి వరకు ఏ హీరో చేయని రొమాన్స్ రజనీ కాంత్ చేస్తున్నట్లు సమాచారం. అందరు హీరోల రొమాన్స్ లు , బీచ్ ల్లో, పడక గదిల్లో లేదా తదితర ప్రదేశాల్లో సహజంగా రొమాన్స్ చేయటం జరుగుతుంది. కానీ ఈసారి రజనీకాంత్ చేసే రొమాన్స్ కు ఒక ప్రత్యేకత ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు.
రజనీకాంత్ హీరోగా కొత్త సినిమా ‘లింగా’ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ రొమాన్స్ చాలా హైలెట్ గా ఉంటుందని చిత్ర దర్శకుడు చెబుతున్నారు. రజనీకాంత్ లింగా సినిమా మైసూర్ ఫ్యాలెస్ లో జరుపుకునే అవకాశం దొరికింది. గతంలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా అక్కడ షూటింగ్ జరిపారు. దీంతో అధికారులు అడ్డు చెప్పడంతో షూటింగ్ స్పాట్- ని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చారు.
అయితే మైసూర్ మహారాజా ప్యాలెస్-లో షూటింగ్ చేయాలన్న కోరికను చంపుకోలేని యూనిట్… ఎట్టకేలకు రాజభవనం అధికారుల నుంచి పర్మిషన్ పొందారు. ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని మహారాజా ప్యాలెస్-లోని ఓ గదిలో సూపర్ స్టార్ రజనీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా ఆ గది మొత్తం బంగారంతో పూయబడి ఉండటం స్పెషాల్టీ. అలాంటి బంగారు గదిలో రజనీ తన జోడీలతో రొమాన్స్ చేస్తాడని చిత్ర దర్శక, నిర్మాతలు అంటున్నారు. అంటే. రజనీతో నటించి హీరోయిన్ తో ఆ బంగారు గదిలో రొమాన్స్ చేస్తాడట. తమ అభిమాన హీరో బంగారు గదిలో రొమాన్స్ చేస్తున్నాడని రజనీ అభిమానులు ఆనందంలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలను ఆ బంగారు గదిలో షూట్ చేసే అవకాశం రావటంతో రజనీతో పాటు యూనిట్ సంతోషంలో మునిగి తేలుతున్నట్లు.. కోలీవుడ్ కుర్రోళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన రజనీ స్టైలే .. స్టైలు.. ..
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more