ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, వివాదాలకు నిత్యం విద్యార్ధి అయిన వర్మ కు ఉన్న పొగరు ఏంటో .. లైవ్ చూపించాడా? అంటే అవుననే అంటున్నారు సినీజనాలు. ఇటీవల వర్మ తీసిన ఐస్ క్రీమ్ పై వివాదం మొదలైంది. దీంతో వర్మ ఓ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ షోకి వచ్చాడు. ఇటీవల విడుదలైన ‘ఐస్ క్రీమ్’ సినిమా హారర్ సినిమా కాదని, హారిబుల్ అని సదరు ఛానల్ వారు సినిమా రివ్యూను ప్రసారం చేశారు. 6 మార్కులకు గాను 1.5 రేటింగ్ ఇస్తున్నామంటూ వారు చెప్పేశారు.
దీంతో రాంగోపాల్ వర్మ లైవ్ షోలో ఫైర్ అయ్యాడు. ‘నా సినిమాలకు రివ్యూ రాసిందెవరు?’ అంటూ చిర్రుబుర్రులాడాడు. తన సినిమాల గురించి ‘కుక్కలు’ మొరిగితే పట్టించుకోనని అన్నాడు. దానికి టీవీ ఛానల్ ప్రతినిధి ‘కుక్కలు అని అనడం తప్పు కదా?’ అంటే... ‘కుక్క అని అనడం తప్పయితే, నన్ను ఉద్దేశించి ‘దురద తీర్చుకున్నా’నంటూ మీరు అనడం కరెక్టేనా? అంటూ ప్రశ్నించాడు. కార్యక్రమం జరుగుతుండగానే కోపంతో రాంగోపాల్ వర్మ మధ్యలో లేచి వెళ్లిపోయాడు.
దీంతో వర్మ సవాల్ విసిరి ఇలా మద్యలో పొగరుగా లేచి వెళ్లిపోవటం, మద్యలో రివ్యూ రాసే వారికి (కుక్కులు) అన్నందుకు సారీ చెప్పటం చూస్తే.. ఆయన పొగరు, ఆవేశం ఏమిటో అందరికి తెలిసిపోయిందని సినీ జనాలు అంటున్నారు. టాలీవుడ్ లో వర్మ ఒక్కడే సినిమాలు తీస్తున్నాడా? వర్మ ఒక్కడే దర్శకుడా? ఈయన సినిమాలు తీస్తేనే ప్రజలు చూస్తున్నారా? అనే విధంగా వర్మ మాట్లాడటం టాలీవుడ్ లోని కొంతమందికి తలనొప్పిగా మారాయి. వర్మ ఐస్ క్రీమ్ సినిమాతో.. టాలీవుడ్ లోని చిన్న దర్శకులు, భయపడుతున్నారు. ఇలా ప్రతి వాడి మీద వర్మ రాళ్లు వేసుకుంటే పోతే.. ప్రజల నుండి సినిమాలపై వ్యతిరేకత వస్తుంది, దీంతో నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
ఏమైన వర్మ చాలా మారాలని , ఆయన అభిమానులు అంటున్నారు. బూతు సినిమాలు, భూతాల సినిమాలు, రక్త చరిత్ర తప్పితే.. వర్మ తీసే సినిమాలు సమాజానికి, యువతకు ఏమైన ఉపయోగపడుతున్నాయా? అసలు నిజం చెప్పలంటే.. వర్మ తీసే సినిమాలు చూసే యువత చెడిపోతుందని కొన్ని మహిళ సంఘాలు అంటున్నాయి. సినిమా అంటే వినోదం ఉండాలి గానీ, ఐస్ క్రీమ్ పేరుతో శృంగారం, భూతాలతో భయపెట్టి, డబ్బులు వసూలు చేసుకోవటమే వర్మ తెలుసునని.. మహిళ అభిమానులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more