(Image source from: aishwarya rai to act with chiranjeevi in his 150 film)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త వస్తూనే వుంది. ఇంకా కథగానీ, డైరెక్టర్ గానీ ఫైనలైజ్ కాకపోయినప్పటికీ.. హీరోయిన్ల చిట్టా మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే వుంది. ఇప్పటికే చిరు కొత్త సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా త్రిష, శ్రియ, నయనతార, అనుష్కలలో ఎవరో ఒకరు నటించడం ఖాయమని వార్తలు జోరుగానే సాగాయి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా తెరమీదకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఐశ్వర్య రాయ్ కూడా చేరిపోయింది. ప్రస్తుత అంతర్గత సమాచారాల ప్రకారం.. ఐశ్వర్య, చిరుతో చిందులేయడం ఖాయమని చెబుతున్నారు కానీ ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
ఇదిలావుండగా.. ఇర్ఫాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషిస్తున్న ‘‘జజ్బా’’ సినిమాలో ఐశ్వర్య నటించడానికి ఓకే చెప్పేసింది. ఈ మూవీ డిసెంబర్ నుంచి స్టార్ట్ కాబోతోంది. అలాగే మరో సినిమాకోసం బాలీవుడ్ దర్శకనిర్మాతలతో ఐష్ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ చిరు 150వ మూవీ మేకర్స్ ఐశ్వర్యను సంప్రదిస్తే.. తానున్న పరిస్థితిల్లో డేట్స్ అడ్జస్ట్ కాక అందుకు నిరాకరించవచ్చునే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే.. ఐశ్వర్య కూడా చిరుతో నటించడం కష్టమేనని ఇన్ సైడ్ టాక్! అయినప్పటికీ ఐశ్వర్య డేట్స్ ని అడ్జస్ట్ చేసుకుని చిరుతో నటించడానికి అంగీకరిస్తే మాత్రం.. సౌత్ ఇండస్ట్రీలో ఇదొక గ్రేట్ కాంబినేషన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.
మరోవైపు చిరు 150వ సినిమాను ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నట్టు అందరికీ తెలిసిందే! అయితే వీరిద్దరి నుంచి 150వ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఏ సమాచారం అందడం లేదు. తన బర్త్ డే నాడే 150వ చిత్రం గురించి క్లారిటీ ఇస్తానని చెప్పిన మెగాస్టార్.. ఇంతవరకు నోరుమెదకపోవడంపై ఫ్యాన్స్ కాస్త నిరాశగానే వున్నట్లు తెలుస్తోంది. రానురాను ఈ మూవీకి సంబంధించి ఇంకెన్ని పుకార్లు రానున్నాయో!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more