సాధారణంగా చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా ఆఫర్లను సాధించాలంటే ఎన్నో కష్టాలు, అవస్థలు పడాల్సి వుంటుంది. కేవలం అందం మాత్రమే వుంటే సరిపోదు... సన్నివేశాలకు తగ్గట్టు మంచి నటన ప్రతిభతో దర్శకనిర్మాతల మనస్సును గెలుచుకోవాల్సి వుంటుంది. ఆ పరీక్షల్లో పాసైన తర్వాత నిర్మాతలు సదరు అమ్మాయిలకు హీరోయిన్ గా అవకాశమివ్వడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న గ్లామర్ డాల్ సమంత కూడా ఇలాగే ఎన్నో కష్టాలు పడి, దర్శకనిర్మాతల మనస్సును దోచుకుంటూ.. నేడు వారినే డేట్స్ కోసం తన వెంట తిప్పుకోంటోంది. సమంత తమ సినిమాల్లో నటిస్తే.. ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని ప్రొడ్యూసర్లు వ్యక్తపరుస్తున్నారు.
ఇదిలావుండగా.. తాజాగా ఒక ఇంటర్య్వూలో సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకూ, నిర్మాతలకు మధ్య వుండే రిలేషన్ గురించి తెలిపింది. సౌత్ ఇండస్ట్రీలో వుండే నిర్మాతలందరూ తనను ఎంతగానో గౌరవిస్తున్నారని... తమ సినిమాల్లో తననే(సమంత) తీసుకోవాలని కోరుకుంటుకున్నారని తెలిపింది. ఇంటర్య్వూలో భాగంగా ఒక మీడియా ప్రతినిధి ‘‘మీరు బాలీవుడ్ కి వెళ్లాలనుకుంటున్నారా..?’’ అని ప్రశ్న అడిగిన నేపథ్యంలో సమంత ఇలా స్పందించింది. అలాగే తనకు బాలీవుడ్ కి వెళ్లాలనే ఆలోచన తన మదిలో లేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే సమంత మాట్లాడుతూ.. ‘‘నేను సౌత్ లో చాలా బిజీగా వున్నా. ఇక్కడ నాకోసం ఆయా దర్శకులు కొత్తకొత్త పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. నాకంటూ అభిమానులు చాలామంది వున్నారు. నేనే కావాలని కోరుకునే నిర్మాతలూ వున్నారు. అలాంటప్పుడు వీటన్నిటినీ వదులుకొని.. ఎక్కడికో ఎందుకు వెళ్లాలి? నాకైతే అంత అవసరం లేదనిపిస్తోంది. అందుకే బాలీవుడ్ ఆలోచనే నా మదిలో లేదు’’ అని తేల్చి చెప్పేసింది. ఒకవైపు కాజల్, తమన్నా, తాప్సీ వంటి భామలు బాలీవుడ్ వైపు పరుగులు తీస్తుంటే.. ఈ అమ్మడు మాత్రం సౌత్ ఇండస్ట్రీయే బెస్ట్ అంటూ.. అందరితో మంచి మార్కులే కొట్టేసింది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more