ఈమధ్యకాలంలో చిత్రపరిశ్రమలో వున్న టాప్ సెలబ్రిటీలందరూ కొన్నికొన్ని సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే! పేదవాళ్లకు డబ్బుల సహాయం అందించడం.. అనారోగ్యంగా వున్నవారికి ఆసుపత్రిలో చేర్పించి - చికిత్సలు చేయించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాగే ఆర్గాన్ డొనేషన్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి విదితమే! ఈ వ్యవహారంపై బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ఎప్పటినుంచో ప్రచారాలు మొదలుపెడితే.. ఇటీవల మన టాలీవుడ్ లో నాగార్జున, అమల, ఇంకా తదితర సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా వీరిజాబితాలోకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేరిపోయినట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీలందరూ ఆర్గాన్ డొనేషన్ ను ప్రమోట్ చేస్తుండగా... చెర్రీ మాత్రం ఒక ముసలాయనకు ఏకంగా తన కిడ్నీనే డొనేట్ చేశాడని గాసిప్స్ బాగానే జోరందుకున్నాయి. దీంతో ఇప్పుడు చెర్రీ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. అయితే చెర్రీ తన కిడ్నీని దానం చేసింది రియల్ లైఫ్ లో కాదులెండి... అతను తాజాగా నటించిన ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమాలో తాత క్యారెక్టర్ లో నటిస్తున్న ప్రకాష్ రాజ్ కు చెర్రీ తన కిడ్నీ దానం చేసి, అతనికి కొత్త జీవితాన్ని అందిస్తాడనే సన్నివేశం వున్నట్టు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ సీన్ ఈ సినిమాలో పెద్ద హైలైట్ కానుందని ఇండస్ట్రీవర్గాల నుంచి వినిపిస్తున్న టాక్! ఇలా ఈ విధంగా చెర్రీ తన సినిమాలో కిడ్నీ దానం చేసి, తన తాతయ్యను కాపాడుకుంటాడన్నమాట!
గతంలో చిరంజీవి కూడా ‘‘విజేత’’ సినిమాలో తన కిడ్నీ దానం చేసి కుటుంబాన్ని కాపాడుకున్నట్టే.. చెర్రీ కూడా తన సినిమాలో కొన్ని త్యాగాలు చేస్తూ కుటుంబాన్ని కాపాడుకుంటాడని.. తాత ప్రకాష్ రాజ్, బాబయ్ శ్రీకాంత్ ల మధ్య వున్న విభేదాల్ని దూరం చేస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి. టోటల్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో గతంలోలాగా కాకుండా చెర్రీ సెంటిమెంట్ తో ప్రేక్షకులను బాగానే అలరిస్తాడని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. మరి చెర్రీ సెంటిమెంట్ కు ప్రేక్షకులు ఎలాంటి మార్కులు వేస్తారో..? వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more