పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరూ విడిపోయిన తర్వాత చాలాకాలం వరకు వారిద్దరికీ సంబంధించిన వ్యవహారాలు మళ్లీ తెరమీదకు రాలేదు. ఆమధ్య ఎప్పుడో కోర్టు కేసులకోసం వీరిద్దరికి సంబంధించిన వార్తలు బాగానే షికార్లు చేశాయి కానీ.. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలాకాలం తర్వాత రేణుదేశాయ్ తెరకెక్కిస్తున్న ‘‘ఇష్క్ వాలా లవ్’’ మూవీ నేపథ్యం నుంచి వీరిద్దరి మధ్య వార్తలు వేగవంతమయ్యాయి. తన మూవీ ప్రమోషన్ కోసమే లేక పవన్ మీదున్న అభిమానమో తెలియదు కానీ... రేణు మాత్రం మొదట్లో పవన్ కల్యాణ్ ను తన గురువంటూ బాగానే పొగిడేసింది. ఆయన బర్త్ డే నాడే మూవీ టీజర్ రిలీజ్ కావడం తన అదృష్టమంటూ చెప్పింది. మళ్లీ పవన్ అభిమానులు కాస్త నిరాశపడేలా ఫేస్ బుక్ లో పవన్ గురించి ఒక వివరణ కూడా ఇచ్చుకుంది. ఇలా వీరిద్దరికి సంబంధించి రోజుకో వార్త వస్తూనే వుంది. తాజాగా రేణు దేశాయ్ మరోసారి పవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం!
తన ‘‘ఇష్క్ వాలా లవ్’’ చిత్రం ప్రమోషన్ సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన రేణు.. పవన్ సినిమాల గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో... ‘‘ఇప్పటికీ మీరు పవన్ సినిమాలను చూస్తారా..?’’ అని ఆమెను ప్రశ్నించగా.. అందుకు బదులుగా ఆమె పవన్ సినిమా డివిడిలు పూర్తిగా పాడైపోయాయంటూ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ... పవన్ కొత్త సినిమా ఏది రిలీజైనా తాను తప్పకుండా చూస్తానని తెలిపింది. ఇప్పటికే ఆమె ‘‘గబ్బర్ సింగ్’’ మూవీని ఓ అరవైసార్లు.. ‘‘అత్తారింటికి దారేది’’ చిత్రాన్ని ఓ ఇరవైసార్లు చూసి వుంటానని తెలిపింది. తనకన్నా తన పిల్లలు అఖిరానందన్, ఆధ్యాలకే తమ తండ్రి సినిమాలు చూడటమంటే చాలా ఇష్టమని... వారు ప్రతిరోజూ ఆయన సినిమాలను చూస్తూనే వుంటారని వివరణ ఇచ్చుకుంది.
తన పిల్లలతో కలిసి వున్నప్పుడు తాను కూడా పవన్ సినిమాలను చూస్తానని.. ఆ సందర్భంగానే ఆ రెండు సినిమాలను చాలాసార్లు చూశానని రేణు చెప్పుకొచ్చింది. ఇంతవరకు ఆయనకు సంబంధించిన ప్రతి సినిమాలను పిల్లలు ఎక్కువగా చూడటం వల్ల చాలా డివిడిు పాడయ్యాయని తెలిపింది. ఇప్పటికీ పవన్ అంటే తనకు ఎంతో అభిమానముందని రేణు ఇలా సినిమాల ద్వారా విశ్లేషించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుండగా... రేణు తన సినిమాను బాగా పాపులర్ చేసుకోవడం కోసమే పవన్ లాంటి పవర్ స్టార్ పేరును రేణు వాడుకుంటోందని... పవన్ క్రేజుతో తన సినిమా కలెక్షన్లను పెంచుకోవాలని రేణు భావిస్తోందని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. పవన్ మీదున్న అభిమానంతో రేణు ఆయనను పొగుడుతోందని మరికొంతమంది పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more