చిత్రపరిశ్రమలో పవన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పవన్ కల్యాణ్... ‘‘జనసేన’’ పార్టీ పెట్టి రాజకీయరంగంలోనే అదే దూకుడుతో దూసుకుపోతున్నాడు. ‘‘సామాన్య ప్రజలకు అన్యాయం జరగకుండా అధికారులను ప్రశ్నించడానికి నేను ముందున్నాను’’ అనే నినాదంతో అడుగులు వేసిన పవనుడికి అప్పుడే కోట్లాదిమంది అతని వెంటే పయనం కొనసాగించారు. సాక్షాత్తూ ప్రధాని మోడీకి అత్యంత నమ్మకస్తుడిగా, సన్నిహితుడిగా పేరుగాంచాడు. ఇలా ఈవిధంగా రెండు విభాగాల్లోనూ ‘‘పవర్’’లా వెలిగిపోతున్న పవన్ ఏం చేసినా సంచలనంగానే మిగిలిపోతోంది. సినిమాల వ్యవహారంలోగానీ, రాజకీయపరంగాగానీ పవన్ కు సంబంధించి ఏదో ఒక వార్త రావడం పరిపాటిగా మారిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే.. గతకొన్నాళ్ల నుంచి పవన్, మెగాకుటుంబం నుంచి దూరంగా వుంటున్నాడనే వార్తలు ఇంకా చక్కర్లు కొడుతూనే వున్నాయి. పవన్ పార్టీ పెట్టకముందే ఈ తరహా వార్తలు చాలానే వచ్చాయికానీ.. అతడు పార్టీ పెట్టిన తరువాత అవి మరింత బలపడుతున్నాయి. ఈ విషయంపై గతంలో చిరంజీవి తమమధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎక్స్ ప్లనేషన్ ఇచ్చారుగానీ.. పవన్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. వ్యక్తిగతంగా వారిమధ్య ఎటువంటి అంతరాయాలు వున్నాయో పక్కాగా తెలియాదుగానీ.. మీడియాలో మాత్రం వీరిద్దరి మధ్య ఖచ్చితంగా విభేదాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి.
ఇటీవలే విడుదలైన రామ్ చరణ్ ‘‘గోవిందుడు అందరివాడేలే’’ మూవీ ఆడియో ఫంక్షన్ కి పవన్ హాజరు కాలేదు. దాంతో అప్పట్లో మెగాబ్రదర్స్ మధ్య చీలికలు వచ్చాయంటూ తెగ వార్తలు వచ్చేశాయి. అయితే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘‘పిల్లా నువ్వులేని జీవితం’’ ఆడియో ఫంక్షన్ కు పవన్ ఖచ్చితంగా వస్తారంటూ మెగాసన్నిహితవర్గాలు ప్రచారం చేసుకున్నాయి. కానీ ఆ ఫంక్షన్ కు కూడా పవన్ హాజరు కాకపోవడంతో సంచలనంగా మారింది. నిజానికి పవన్ కు తన మేనల్లుడు సాయి అంటే ఎనలేని ప్రేముంది. అతని ఫిలిం ఇండస్ట్రీలో రావడం వెనుక పవన్ పాత్రే కీలకం. అలాంటి పవన్ తన మేనల్లుడి మొదటి మూవీ ఆడియో వేడకకు హాజరు కాలేదు.
సాధారణంగా మెగాఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా దానికి చిరంజీవి, అల్లుఅరవింద్ తోపాటు వాళ్ల వారసులంతా హాజరవుతారు. మొన్న జరిగిన ‘‘పిల్లా నువ్వులేని జీవితం’’ ఆడియో వేడుకకు వీరంతా వచ్చారుగానీ.. పవన్ మాత్రం రాలేదు. పవన్ వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్కడి అభిమానులు ఆ వేడుకలో ‘‘పవన్ కల్యాణ్’’ అంటూ గట్టిగా అరిచారు. అయితే ఫంక్షన్ అయిపోయింది కానీ పవన్ మాత్రం రాలేదు. పవన్ ఇలా హాజరుకాకపోవడం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. ఓవైపు అభిమానులు పవన్ ఆ వేడుకకు ఎందుకు హాజరు కాలేదోనన్న తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయారు. వీరిమధ్య నిజంగానే విభేదాలున్నాయా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే మెగాఫ్యామిలీకి పవన్ దూరంగా వుంటున్నాడని.. మెగాభిమానులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారంటూ ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఇలా గౌర్హాజరు కావడంతో ఆ ప్రచారాలు నిజమేనని బలపడుతున్నాయి. అయితే.. రాజకీయపరంగా చిరంజీవి ఆలోచనలకు, పవన్ సిద్ధాంతాలకు చాలా వ్యత్యాసం వున్న నేపథ్యంలో.. ఆ కారణాలతోనే మెగా ఫ్యామిలీకి పవన్ దూరంగా ఉంటున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. లేదా.. కుటుంబంలో ఏదైనా అంతర్గత సమస్య తలెత్తిందా? అని కూడా డౌట్ పడుతున్నవారు లేకపోలేదు. ఏదేమైనా... పవన్ మెగాఫ్యామిలీతో దూరంగా వుంటూ ఇలా ఒంటరిపోరాటం కొనసాగించడంతో ఆ ఫ్యామిలీ నుంచి అతడు ‘‘ఔట్’’ అయ్యాడేమోనని భావిస్తున్నారు. ఇలా ఎంతకాలంపాటు ఇలా వుంటారోనని చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more