ఎంత స్టార్ హీరోయిన్లు అయితేనేం... వారిక్కూడా సాధారణ అమ్మాయిలలాగే కొన్ని ప్రత్యేకమైన కోరికలు వుంటాయి. అలాగే హన్సిక కూడా తన చిరకాల కోరికను బయటపెట్టేసింది. ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ అమ్మడు తెగ ఆరాటపడుతోందట! అందుకే.. బహిరంగంగా తన మనసులోని మాటను చెప్పేసింది. అయితే ఈమె కోరికను ఓ తమిళ దర్శకుడు త్వరలోనే తీర్చబోతాడనే వార్తలు బాగానే ప్రచారం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న సదరు దర్శకుడు ఆ వార్తలను ఖండిస్తూ.. ఆమె కోరికను తీర్చలేనంటూ చెప్పేశాడు. ఇంకా ఆ విషయంపై తాను ఏ నిర్ణయం తీసుకోలేదని.. దానిగురించి తానేమీ మాట్లాడలేనంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. దీంతో హన్సిక తీవ్ర నిరాశకు గురైందని.. ఆమె తన కోరిక తీర్చుకోవడం ఎంతమంది దర్శకుల వెంటపడాల్సి వస్తుందోనని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అసలు విషయం ఏమిటంటే... తమిళ, తెలుగు భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హన్సిక ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే తనకు తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నటించాలని వుందని.. అతనితో కలిసి నటించడమే తన చిరకాల కోరికంటూ ఇటీవలే ఓ మీడియాద్వారా ప్రకటించింది. దాంతో హీరో అజిత్ తన తదుపరి సినిమాలో ఈ అమ్మడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తమిళ మీడియాలో తెగ వార్తలొచ్చాయి. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ హీరో.. తర్వాత శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది. అందులో కథానాయికగా హన్సికనే తీసుకుంటున్నారని ప్రచారాలు తిరుగుతున్నాయి. హన్సిక తాజాగా తన మనసులో మాటను బయటపెట్టిన నేపథ్యంలో అజిత్ ఆమెను తదుపరి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడని సమాచారం!
అయితే తాజాగా దర్శకుడు శివ ఆ వార్తలను ఖండించాడు. తాను హీరో అజిత్ తో తీయబోయే సినిమాలో హన్సిక నటించడం లేదనీ.. ఇంతవరకు కథానాయికను ఎంపిక చేయలేదని స్పష్టం చేశాడు. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు ఇంకా ప్రారంభించలేదని.. త్వరలోనే వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దీంతో హన్సిక ఆశలు ఒక్కసారిగా నీరుగారిపొయ్యాయి. భవిష్యత్తులోనైనా ఈ అమ్మడి కోరిక తీరుతుందో..? లేదో..? వెయిట్ చేయాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more