ఫ్యామిలి ఓరియంటెడ్ సినిమాల నుంచి యాక్షన్ మూవీలు, ప్రస్తుతం సందేశాత్మక చిత్రాలు ఇలా ఏదో ఒక రకమైన సినిమాలతో టాలీవుడ్ లో రెండు మూడేళ్లకు ఓ సారి బయటకు వచ్చే హీరో డా.రాజశేఖర్. ప్రస్తుతం ఈయన ‘గడ్డంగ్యాంగ్’ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా రాజశేఖర్ గురించి ఫిలింనగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక ఆయన సినిమాల్లో హీరోగా చేయరు అని పలువురు అంటున్నారు. లీడ్ రోల్స్ కు స్వస్తి చెప్పి.., మెయిన్ క్యారెక్టర్, సెకండ్ లీడ్ రోల్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కీ.శే. శ్రీహరి ఈ తరహా పాత్రలు పోషిచంగా.., ప్రస్తుతం జగపతి బాబు కూడా ఇలాంటి క్యారెక్టర్లలో నటిస్తున్నాడు. ఇవి బాబుకు చాలా పేరు, ఆఫర్లు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం జగపతిబాబు విలన్ క్యారెక్టర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదే కోవలో రాజశేఖర్ కూడా హీరో పాత్రల నుంచి పక్కకు తప్పుకుని సెకండ్ రోల్ అంటే హీరో అన్నయ్య, తండ్రి, లేదా మరొక క్యారెక్టర్ లో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడట. ఇలా అయితే హీరో ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటతో పాటు, ఎప్పుడూ సినిమాల్లో కన్పిస్తూ ఫ్యాన్స్ కు దూరం కాకుండా ఉండవచ్చు.
చాలా కాలం నుంచి రాజశేఖర్ సినిమాలు తీస్తున్నారు. ఆయన కాలంలో హీరోలుగా ఉన్నవారు ప్రస్తుతం నటన నుంచి బయటకు వెళ్లగా.., కొందరు క్యారెక్టర్లు చేస్తున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం ఇఫ్పటికీ హీరోగానే చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ర్టీ అంతా కొత్త వారితో నిండిపోవటంతో ఇలాంటి పాత హీరోలకు ఆదరణ కాస్త తక్కువ అవుతుంది. దీనికి తోడు సొంత నిర్మాణంలో సినిమాలు తీసే అలవాటున్న ఈయనకు రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకనీ క్యారెక్టర్ రోల్స్ అయితే బెటర్ అనుకుంటున్నాడు. హీరోగా మెప్పించిన రాజశేఖర్ ఇతర పాత్రల్లో కూడా ప్రజాదరణ పొందుతాడని ఆశిద్దాం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more