హీరో రామ్ చరణ్ తేజ్ తదుపరి సినిమాపై చాలా ఊహాగానాలు వచ్చాయి. కోన వెంకట్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని కొందరు, కాదు కన్నడ రీమేక్ చేస్తాడని మరికొందరు అనుకున్నారు. శ్రీనువైట్లతో సినిమా చేస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడదే జరిగింది. చెర్రితో సినిమా చేసేందుకు శ్రీను పడిన కష్టం ఫలించింది. వైట్లతో సినిమా చేసేందుకు మెగా హీరో ఒఫ్పుకున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘ఆగడు’ ఫెయిల్యూర్ కారణంగా శ్రీను ప్రాజెక్టును చెర్రీ పక్కనెట్టాడు. అయితే సినిమా ఓకే చేయించుకునేందుకు కామెడి డైరెక్టర్ అనేక విధాలుగా ప్రయత్నించాడు. చివరకు వక్కంతం వంశీతో కథ రాయించుకుని విన్పించాడు. దీంతో వైట్ల కష్టాన్ని, సినిమా చేయాలన్న తాపత్రయం చూసి రామ్ చరణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ కధకు వంశీ తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాను డి.వి.వి దానయ్య నిర్మిస్తారని తెలుస్తోంది. బహుశా డిసెంబర్ లో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అటు చరణ్ ఓ కన్నడ రీమేక్ సినిమాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత చరణ్ ఏ సినిమాకు సైన్ చేయలేదు. కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టుకు ఓకే చెప్పాడు. కానీ ఫైనలైజ్ కాలేదు. అదేవిధంగా గౌతమ్ మీనన్ తో సినిమా అనుకుంటే ప్రస్తుతం ఆయన అజిత్ సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో గ్యాప్ ఎందుకని కన్నడ సినిమా ‘బహద్దూర్’ ను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ మద్య కన్నడలో వచ్చిన ‘బహద్దూర్’ సినిమా సూపర్ హిట్ అయింది. ద్రువ్ సర్జా, రాధకా పండిట్ నటించిన ఈ మూవీని చేతన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ చూసిన చెర్రీ ఎలాగైనా సినిమా చేసేయాలని డిసైడ్ అయ్యాడట. సినిమా రీమేక్ హక్కులు దక్కించుకునే పనిలో సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ కమ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్ కెరీర్ మైల్ స్టోన్ ‘మగధీర’కు ఈ మూవీతో కొన్ని చోట్ల సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more