ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 కోట్ల రూపాయల ప్రాజెక్టు.. దానిపైనే ఆశలు పెట్టుకుని గత రెండేళ్లుగా ఇతర సినిమాలకు కూడా దూరమయ్యాడు ఆ హీరో. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యివుంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడటంతో పాటు.. తన సినిమాల ద్వారా చక్కని సందేశాలను ప్రజలకు ఇవ్వడంలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు శంకర్ ప్రతాష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న చిత్రం ఐ. ఇందులో హీరో విక్రమ్ విభిన్న పాత్రను పోషిస్తున్నాడు. అయితే చిత్రం కోసం తీవ్రంగా శ్రమపడుతున్న విక్రమ్ కఠోర దీక్షనే చేపట్టాడు.
ఈ కఠోర శ్రమ ఫలితంగా ఆయన అనారోగ్యానికి గురైయ్యడని వార్తలు అటు కాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోనూ షికారు చేస్తున్నాయి. ఇటీవల విక్రమ్ తాజా ఫోటో ఒక్కడి బయటికి రావడంతో.. ఆయన విక్రమేనా.. అంతగా సన్నబడ్డాడు ఏమిటి అంలూ విక్రమ్ ఆరోగ్యంపైన చిత్రసీమ వర్గాల్లో కలవరం మొదలైంది. ఈ ఫొటో నిజమైనదో, మార్ఫింగ్ చిత్రమో తెలీదు కానీ, తాజాగా నెట్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా చకర్లు కొడుతోంది. దీనికి తోడు ఐ చిత్రానికి సంబంధించి విక్రమ్ ఫస్ట్ లుక్ అంటూ సినిమా యూనిట్ విడుదల చేసిన చిత్రంలోనూ విక్రమ్ చాలా సన్నగా కనిపించాడు. శంకర్ దర్శకత్వంలో ‘ఆస్కార్’ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తారు. అందులో బక్కపలచని అవతారం ఒకటి. ఆ గెటప్ కోసమే విక్రమ్ సన్నబడిపోయారని సినిమా యూనిట్ వర్గాలు చెబుతున్నారు.
ఎముకల గూడును తలపించే ఈ దేహం కోసం షూటింగ్ సమయంలో ఆహారపరంగా, వ్యాయామాల పరంగా శరీరాన్ని చాలా కష్టపెట్టుకున్నారట. పాత్ర కోసం విక్రమ్ గతంలో కూడా పలు రిస్కులు తీసుకున్నారు. ‘ఐ’ కోసం తీసుకున్న ఈ రిస్క్ వాటన్నింటికీ పరాకాష్ఠ అని తమిళ సినీ జనం చెవులు కొరుక్కుం టున్నారు. ఫొటో నిజానిజాల మాటెలా ఉన్నా శరీరం మీద ప్రయోగాలు చేయడం శ్రేయస్కరం కాదనీ, విక్రమ్ తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సన్నిహితులు సూచిస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా తీవ్ర శ్రమకు ఒర్చిన సినిమా యూనిట్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలే ఎదురవుతున్నాయి. సినిమాకు సంబంధించిన తొలి థియరాటికల్ ట్రయిలర్ ను విడుదల చేశారు. ఈ థియరాటికల్ ట్రేయిలర్ కు ప్రేక్షకులు, మీడియా వర్గాల నుంచి మంది ఆదరణ లభిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more