జూనియర్ ఎన్టీఆర్ కు సినిమా కష్టాలు తప్పటం లేదు. కొద్ది కాలంగా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవేళ ఆదరణ పొందినా.., గతంలో వచ్చినంత పాపులారిటీ రావట్లేదు. సినిమాలకు ఈ అడ్డంకులు రావటంపై నందమూరి ఫ్యాన్స్ చాలా ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘టెంపర్’ సినిమా ఆగిపోయింది. షూటింగ్ ఎప్పుడో పూర్తయి, డిసెంబర్ లో ఆడియో విడుదల జరుపుకుని, సంక్రాంతి రేసులో విడుదల కావాల్సిన సినిమా ఇది.
కాని జానకీరామ్ మృతితో పాటు ఇతర కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. కేవలం పది రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉన్నా., అది పూర్తి చేసే సమయం లేకపోవటంతో సంక్రాంతి బరి నుంచి సినిమా తప్పుకుంది. ఎలాగూ రేసులో లేదు కాబట్టి.., నిదానంగా వేసవి ప్రారంభంలో వస్తుంది అని అంతా భావించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇప్పట్లో సినిమా రాదు అనుకుని డీలా పడ్డారు. అయితే పుకార్లన్నీ అబద్దాలని సినిమా యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి తర్వాత ఇరవై రోజులకు సినిమా విడుదల అవుతుందని ప్రకటించింది. తాజా అప్ డేట్ ప్రకారం.., ఫిబ్రవరి 05న సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట.
మరోవైపు పెండింగ్ ఉన్న పది రోజుల షూటింగ్ ను పూర్తి చేసేందుకు కూడా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 29 నుంచి చివరి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. జనవరి 9 లేదా 10వ తేదీ వరకు షూటింగ్ జరుపుకోనుంది. ఎలాగూ పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి కాబట్టి.., సంక్రాంతి తర్వాత ఫైనల్ వర్క్స్ జరుపుకుని విడుదలకు సిద్దం కానుంది. అటు సంక్రాంతి తర్వాత మూవీ ఆడియో విడుదల అవుతుందని చెప్తున్నారు. కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more