ఈమధ్య ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తున్న తారలు కాస్త నటనాప్రతిభను ప్రదర్శించడంతోబాటు అందంగా, సెక్సీగా, బోల్డుగా కనిపిస్తే చాలు.. వరుసబెట్టి వారికి అవకాశాలు వచ్చేస్తున్నాయి. వారి మూవీలు హిట్టయినా, ఫట్టయినా సరే.. ప్రేక్షకులను ఆకర్షించే గుణాలు వారిలో వుంటే.. దర్శకనిర్మాతలు వారి వెంటే పడుతుంటారు. ఇప్పటికే టాలీవుడ్’లో చాలామంది తారలు ఈవిధంగానే అవకాశాలు పొందుతున్నారు. ఇప్పుడు తాజాగా వీరి కోవలోకి మరో సెక్సీ బ్యూటీ చేరిపోయింది.
సులగ్న పాణిగ్రహి అనే ఈ ఒరియా భామ.. ఇటీవలే రేణుదేశాయ్ నిర్మించి-దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి చిత్రంలో నటించింది. ఇది తెలుగులోకి ఇంకా డబ్ కావాల్సి వుంది. అంతేకాదు.. ‘మర్డర్ 2’లోనూ ఈ అమ్మడు తన సెక్సీ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో ఎస్.జే.సూర్య సరసన ‘ఈసేయ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూడు చిత్రాల్లోనూ ఈ అమ్మడు ఎంతో గ్లామరస్’గా, సెక్సీగా కనువిందు చేసి ప్రేక్షకులను తన బుట్టలో పడేసింది. అంతేకాదు.. సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించి అందరి మతులను పోగొట్టేసింది. దీంతో ఈమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజుల్లో సెక్సీ నటిగా క్రేజ్ సాధించడంతో దర్శకనిర్మాతలు ఈమెకోసం కర్చీఫులు పరుస్తున్నారని సమాచారం.
అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాల ప్రకారం.. దర్శకనిర్మాతలు ఈమెను తమ సినిమాల్లో నటింపజేసేందుకు వరుసగా క్యూలు కడుతున్నారట! ఇటీవలే ‘ఈసేయ్’ మూవీ చిత్రంలోని విడుదలైన ఆమె హాట్ ఫోటోలను చూసిన హీటెక్కిపోయిన సదరు దర్శకులు.. ఈమెతో సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లవైపు పరుగులు తీస్తారనే నమ్మకంతోనే ఈమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట! ఇప్పటికే కొంతమంది ఏజెంట్లు ఈమెను సంప్రదించి చాలావరకు మూవీలను ఆఫర్ చేశారట! ఇలా వరుసగా ఆఫర్లు రావడంపై ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేస్తోంది కానీ.. ఏవైనా మూవీలను ఒప్పుకుందా..? లేదా..? అన్న విషయమే తెలియదు! ఏదైతేనేం.. పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే తమిళ, తెలుగు చిత్రపరిశ్రలు ‘రారామ్మని.. రారారమ్మని’ అనేంతగా తన బుట్టులో పడేసుకుందని అనుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more