తెలుగు పరిశ్రమలో వున్న తారలందరూ ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయినవాళ్లే! తెలుగమ్మాయిలు వున్నప్పటికీ.. ఇక్కడి డైరెక్టర్లు వారికి మంచి అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే.. ఇతర (తమిళ, కన్నడ) పరిశ్రమల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళుతున్నారు. ఈ కోవలోనే తాజాగా బింధుమాధవి కూడా చేరిపోయింది. టాలీవుడ్’లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. కోలీవుడ్ లో మాత్రం పెద్ద స్టార్ గా దూసుకుపోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు.. ‘ఆవకాయ్ బిర్యానీ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో ఈమె నటిగా మంచి గుర్తింపు పొందింది కానీ.. చెప్పుకోదగ్గ మూవీ ఆఫర్లు మాత్రం రాలేదు. చివరగా ఈమె ‘పిల్లా జమీందార్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్’గా నటించింది. అంతే! ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. అయితే.. తమిళంలో మాత్రం వరుసగా చిత్రాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు వున్నప్పటికీ.. వారందరికీ ధీటుగా పోటీ ఇస్తూ ఈమె దూసుకుపోతోంది. ఈ ఏడాదిలోనే ఈమె చేతిలో నాలుగైదు మూవీలు వున్నాయి. మరిన్ని మూవీ ఆఫర్లతో దర్శకనిర్మాతలు క్యూలో నిలబడ్డారని సమాచారం!
ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈమె హీరో సూర్యా 2డీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ‘హైకు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో సూర్య, అమలాపాల్ అతిథి పాత్రల్లో తళుక్కుమనబోతున్నారు. ఈ మూవీలో ఇద్దరు పిల్లలే ప్రధాన పాత్రధారులు. వారిద్దరి మధ్య నడిచే కథాచిత్రంలో బిందుమాధవి కీలకపాత్ర పోషించనుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీతోపాటు మరో నాలుగు సినిమాల షూటింగులతో బిజీగా వుంది. ఏదైతేనేం.. మొత్తానికి ఈ అమ్మడికి తెలుగులో కాకపోయిన తమిళ తంబీల ఇంట బాగానే పంట పండిందని విశ్లేషకుల అభిప్రాయం!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more