తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో అమ్మడు తమిళ ఇండస్ట్రీకి తన మకాం మార్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో రెండు సినిమా షూటింగుల్లో బిజీగా వుంది. మొదట అంతా సవ్యంగానే కొనసాగింది కానీ.. వున్నట్లుండి కాజల్ మీద తమిళ నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట! ఎందుకంటే.. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఈ అమ్మడు షూటింగులకు చాలా ఆలస్యంగా వస్తోందట! అయితే.. ఈ అమ్మడు ఇలా కావాలనే చేయడం లేదులెండి.. దీని వెనుక ఒక రహస్యం వుంది.
అదేమిటంటే.. కాజల్ ఇటు తమిళ సినిమాలతోపాటు అటు హిందీలోనూ ఓ రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. అన్ని చిత్రాలు ఒకేసారి షూటింగ్ జరుగుతున్నాయి కాబట్టి.. ఈ అమ్మడు ముంబయ్-చెన్నయ్ నగరాల మధ్య విమానాల్లో చక్కర్లు కొడుతోంది. రాత్రివేళ ముంబయ్ లో హిందీ సినిమా షూటింగులో పాల్గొని.. తిరిగి పొద్దున్నే విమానమెక్కి చెన్నయ్ కి చేరుకుంటోంది. అయితే.. కాస్త విశ్రాంతి తీసుకుని, రెడి అయ్యి, సెట్స్ కి వెళ్లేసరికి మధ్యాహ్నం అయిపోతోందట! ఎంత త్వరగా రావడానికి ప్రయత్నించినప్పటికీ.. అమ్మడు సమయానికి షూటింగ్ స్పాట్ కి చేరుకోలేకపోతోందట! దీంతో ఓ పూట షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని, మధ్యాహ్నమే చిత్రీకరణ జరుపుకోవాల్సి వస్తోంది.
తమిళనాట షూటింగ్ ముగిసిన అనంతరం కాజల్ మళ్లీ సాయంకాలం విమానమెక్కి ముంబయ్ కి చెక్కేస్తోందట! దాంతో తమకు తక్కువ సమయం కేటాయించి, హిందీ సినిమాకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తోందని తమిళ నిర్మాతలు ఆమెపై మండిపడుతున్నారని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇలాగే కొన్నాళ్లపాటు కొనసాగితే.. తమిళనాటలోనూ ఈమెకు ఆఫర్లు తగ్గిపోతాయని అంటున్నారు. మరి.. ఇటువంటి సిట్యువేషన్ లో కాజల్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more