మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రోజుకొక గాసిప్ వెలువడుతూనే వుంది. ఆమధ్య స్టోరీ, డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారని.. షూటింగ్ ప్రారంభం అవడమే తరువాయి అంటూ ఎన్నో వార్తలొచ్చాయి. అంతకుముందు చిరు తన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి నేపాల్ లో చికిత్స చేయించుకున్నారని, నేటి యువహీరోలలాగే యంగ్ లుక్ లో కనిపించేందుకే ఇలా కసరత్తులు చేశారంటూ వార్తలు వెలువడ్డాయి. అలాగే.. తన అందంలో మెరుగులు దిద్దుకోవడం కోసం కేరళలో నేచురోపతి చేయించుకున్నారని సమాచారాలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. తాజాగా చిరుకు సంబంధించి మరో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే ఇండియన్ ఇండస్ట్రీలో యువహీరోల నుంచి సీనియర్ కథానాయకుల వరకు ప్రతిఒక్కరూ సిక్స్ ప్యాక్ లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే! ‘సిక్స్ ప్యాక్’ పట్ల యూత్ లో బాగా క్రేజ్ వున్న నేపథ్యంలో ఇలా ప్రతిఒక్కరూ ఈ ట్రెండ్ ని ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఈ ట్రెండ్ కు అనుగుణంగానే అభిమానులను సంతోషపరచడం కోసం తన 150వ సినిమాలో సిక్స్ ప్యాక్ కనిపించనున్నాడనే ప్రచారాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాయి. చాలాకాలం తర్వాత చిరు ఇండస్ట్రీలో రీ-ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి.. సరికొత్త లుక్స్, గెటప్ తో కనిపిస్తే.. ఒక్కసారిగా భారీ క్రేజ్ వస్తుందన్న ఉద్దేశంతోనే చిరు తనమేరకు ఈ ప్రయత్నం చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే స్వయంగా చిరు నోరుమెదిపితేగానీ తెలియదు.
ఇక చిరు 150వ చిత్రాన్ని పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశముందన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతున్నాయి. ఇంతవరకు ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్న విషయం అధికారికంగా వెలువడలేదు కానీ.. చిరు ‘సిక్స్ ప్యాక్’ ప్రచారం జోరందకున్న నేపథ్యంలో పూరీయే దర్శకత్వం వహించే ఛాన్స్ చాలావరకు వుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. ‘దేశముదురు’లో బన్నీని, ‘టెంపర్’లో ఎన్టీఆర్ లను సిక్స్ ప్యాక్ లో చూపించి పూరీ విజయాలు సాధించాడు. అదే తరహాలోనే చిరుని ఆయన 150వ సినిమాలో చూపించనున్నాడని, అందుకే చిరు కొన్నాళ్లు బాగా కసరత్తు చేసి సన్నబడ్డారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు.. చిరు తన 150వ చిత్రానికి సంబంధించి అధికారికంగా తన బర్త్ డే సందర్భంగా వెల్లడిస్తానని చెప్పారు కానీ.. ఇప్పటివరకు ఆయన ఏమీ చెప్పలేదు. కానీ ఇబ్బడిముబ్బడిగా పుకార్లు మాత్రం నిత్యం సందర్శిస్తున్నాయి. ఆ కోవలోకే వచ్చిన చిరు సిక్స్ ప్యాక్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఈ పుకార్లన్నీ కేవలం ప్రచారం కోసం మాత్రమేనని.. ఆరుపదుల వయస్సుకి దగ్గరపడుతున్న చిరుకి నేటి యువహీరోల్లా కసరత్తు చేసి ‘సిక్స్ ప్యాక్’ పొందడం సాధ్యపడదంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more