ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లందరిలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. ప్రతిఒక్కరు తడుముకోకుండా ‘నయనతార’ పేరు చెప్పేస్తారు. ఎందుకంటే.. ఈమె నిజజీవిత ప్రేమవ్యవహారాల్లో నిత్యం వార్తల్లో నిలిచిన తంతు తెలిసిందే! ఆమధ్య శింబుతో, తర్వాత ప్రభుదేవా వంటి స్టార్లతో లవ్ బ్రేకప్స్ తోపాటు ఎన్నో గాసిప్స్ కి ఈమె కేంద్రబిందువు అయ్యింది. అందుకే.. పరిశ్రమలోనే ఈమెకు వివాదాస్పద నటిగా గుర్తింపు వచ్చింది. కెరీర్ పరంగా బరువైన పాత్రలో పోషించడంతోపాటు సక్సెస్ ఫుల్ దూసుకుపోతున్న ఈమెపై ఇప్పటికీ ప్రచారాలు వస్తూనే వున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె పెళ్లికి సంబంధించి మరో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే నయన దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం నడుపుతోందని, అతన్నే వివాహం చేసుకోనుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే! అయితే.. ఆ వార్తలను వాళ్లిద్దరూ అప్పుడే ఖండించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, తమమధ్య ఎటువంటి ప్రేమ లేదని వారు స్పష్టం చేశారు. కానీ.. వారిద్దరి మధ్య ఇప్పటికీ ‘సంథింగ్ సంథింగ్’ నడుస్తోందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. వారిద్దరూ రహస్యంగా తమ ప్రేమాయణం నడుపుతున్నారనీ.. నలుగురికి కనిపించకుండా చక్కర్లు కొడుతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి చేస్తున్న ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రం చిత్రీకరణ చివరిదశలో వుంది. త్వరలోనే ఈ సినిమా పాటలకు విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ పాటల వేడుకలో.. వీరి ప్రేమకు శుభంకార్డు పడనుందని కొత్తగా ప్రచారం ఊపందుకుంది. ఆ వేడుకలో తమ పెళ్లిపై నయనతార ఓ ప్రకటన చేయడానికి సిద్ధమైందని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇప్పటికే విఘ్నేష్, నయన తమ పెళ్లి వార్త గురించి ఆ వేడుకలో చెప్పేందుకు రెడీ అయ్యారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో త్వరలో జరగబోయే ‘నానుమ్ రౌడీదాన్’ ఆడియో వేడుక కోసం కోలీవుడ్ జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. ఈ వేడుకలో నయన తన పెళ్లిపై ఏ విధంగా కామెంట్ చేయనుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more