ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాలలో కూడా కమెడియన్ బ్రహ్మానందం ఖచ్చితంగా ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే వున్నాడు. బ్రహ్మీ యాక్టింగ్, కామెడీలో ఏ మాత్రం లేకపోయినప్పటికీ.. ఒకవేళ సినిమా విజయం సాధిస్తే అది బ్రహ్మీ క్రెడిట్ గా నమోదు అవుతోంది. అందువల్ల ఈ మధ్య బ్రహ్మీని చాలా మంది దర్శకులు, హీరోలు వారి వారి సినిమాలలో వుండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కానీ వచ్చిన ఓ భారీ ఆఫర్ ను బ్రహ్మీ తిరస్కరించి, ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే... నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ఈ సినిమా కోసం ఐదుగురు రచయితలు పనిచేస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం కోసం ఓ విభిన్న క్యారెక్టర్ ను డిజైన్ చేసారట. కానీ బ్రహ్మీ మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తెలిసింది.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వుండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయడం కుదరక బ్రహ్మీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. మరి బ్రహ్మీ కావాలనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడో లేక బ్రహ్మీని వద్దనుకుని చిత్ర యూనిట్ తీసేసారో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలే బ్రహ్మీని ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు పక్కనపెట్టేసారని వార్తలొస్తున్నాయి. తమ సినిమాలు హిట్టవడానికి కారణం బ్రహ్మీయే అంటూ టాక్ వినిపిస్తుండటంతో బ్రహ్మీకి చాలా ఆఫర్లు తగ్గిపోయినట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై బ్రహ్మీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more