మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి సర్వం సిద్ధమైపోయింది. ఈ సినిమాని సన్సేషనల్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాకోసం చిరంజీవి ఇటీవలే కొంచెం తన వెయిట్ ని కూడ తగ్గి మరీ కష్టపడుతున్నాడు. తమిళంలో భారీ హిట్ సొంతం చేసుకున్న విజయ్ మురుగదాస్ ల సినిమా కత్తి రీమేక్ సినిమానే కత్తిలాంటోడు. కత్తి తమిళ సినిమాలో హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరో కోల్ కత్తా జైలు నుంచి తప్పించుకుంటాడు. బెంగాల్ పోలీసులు అతనికోసం వెతుకుతుంటారు.
అయితే, ఇప్పుడు దీనినిబట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడ కొంత భాగాన్ని కోల్ కత్తాలో షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలను సైతం కోల్ కత్తాలో ప్లాన్ చెయ్యాల్సిందే. ఇప్పుడు సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే గతంలో వి వి వినాయక్ కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. వెంకటేష్ లక్ష్మీ, జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్, రామ్ చరమ్ తేజ్ తో నాయక్ సినిమాలు వినాయక్ కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో తీసినవే. ఈ సెంటిమెంట్ వినాయక్ కి బాగా అచ్చొచ్చిందని ఇప్పుడు కత్తిలాంటోడు సినిమా కూడ కోల్ కత్తా లో తీస్తే తిరుగుఉండదని చెప్తున్నారు అందరూ.
ఇంకో విషయం ఏంటంటే, చిరంజీవి గతంలో నటించిన చూడాలని ఉంది సినిమా కూడ కోల్ కత్తా లో షూటింగ్ జరుపుకున్న సినిమానే అని ఇది ఇద్దరికి కలిసొచ్చే సెంటిమెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ అవుట్ అయితే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు సినీ పండితులు.
-మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more