టాలీవుడ్ లో ఉన్న పెద్ద ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచే దాదాపు ఏడెనిమిది మంది దాకా హీరోలున్నారు. వీళ్లంతా ఇప్పుడు గ్యాప్ లేకుండా బిజీ బిజీగా సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా రిలీజ్ చేస్తూ మరో సినిమాను సెట్ చేస్తూ ఇంకో సినిమాను లైన్లో పెడుతున్నారు. దీంతో ఈ ఫ్యామీ హీరోల వినోదంతో ప్రేక్షకులు, మెగా అభిమానులు అందరూ ఉక్కిరిబిక్కిరి కావల్సిందేనంటున్నారు. అదేంటో మీరు ఒక లుక్కేయండి...
మెగా స్టార్ మళ్లీ దాదాపు 9 ఏళ్ల తర్వాత 150వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వినాయక్ డైరక్షన్ లో ఈసినిమా తెరకెక్కుతోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎస్ జె సూర్య డైరక్షన్ లో సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత దాసరి నారాయణరావు ప్రొడ్యూస్ చేసే సినిమా ఉండబోతోంది.
ఇక అబ్బాయి రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ధ్రువ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ డైరక్షన్ లో కానీ, మారుతి డైరెక్షన్ లో కానీ ఒక సినిమా కమిట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ కూడా శ్రీనువైట్ల డైరక్షన్ లో 'మిస్టర్' అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత మళ్లీ క్రిష్ డైరక్షన్ లో 'రాయబారి' అనే సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.
మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ దర్శకుడు సునీల్ తో కలిసి 'తిక్క' సినిమా చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా, మచ్చరవి డైరక్షన్ లో 'జవాన్' అనే సినిమాని చేయబోతున్నాడు.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో మరో సినిమా, అలాగే హరీష్ శంకర్ తో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
తమ్ముడు అల్లు శిరీష్ కూడా 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో పాటు మల్లిడి వేణు డైరక్షన్ లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
ఇక కొణెదల వారసురాలు ఆడపడుచు నిహారిక కూడ ఒక మనసు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. ఇలా మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు పది పదిహేను సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక మెగా అభిమానులకు సినిమాల మోత మోగిపోతుందని చెప్పుకుంటున్నారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more