టాలీవుడ్ లో హీరో నాని న్యాచురల్ స్టార్ గా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాల తర్వాత నాని మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జెంటిల్ మెన్ అంటూ జూన్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ అయిపోవడం, అందులోనూ అ-ఆ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా నడుస్తుండటం నాని కి మైనస్ పాయింట్సే.
అయితే, తనకి లైఫ్ ఇచ్చిన దర్శకుడు, హ్యూమరస్ కి పెద్దపీఠ వేసే దర్శకమాంత్రికుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అష్టాచెమ్మా సినిమా చిన్నగా వచ్చి ఎంతటి పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదేవిధంగా ఎలాంటి అంచనాలు లేకుండా వస్తోంది జెంటిల్ మెన్.
ఈ సినిమాలో నాని విలనా ? హీరోనా అనే కాన్సెప్ట్ పైనే చక్కని సస్పెన్స్ తో కూడిన కథగా ముందుకు తెస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యుకె సెన్సార్ బోర్డ్ మెంబర్ కైరా సాంథు కూడ మంచి రివ్యూ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఓవర్సీస్ బిజినెస్ లో మంచి జోరుమీదున్న నాని ఈసారి ఈ సినిమాతో తన గత సినిమాలా రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా, లేదా బాక్సాఫీసు ముందు బోల్తా పడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం నాని అగ్రహీరోలను సైతం క్రాస్ చేసి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోతాడు. అదే జరిగితే, ఒక చిన్న హీరో ఇలా హ్యూజ్ మార్కెట్ ని కైవసం చేసుకోవడం చరిత్ర సృష్టించడమే అని చెప్తున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు. మరి ఈ సినిమాతో నాని పడతాడా ? కొడతాడా ? తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more