రీమేక్ ధ్రువతోనైనా కసి తీరా హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఒరిజినల్ వర్షన్ లో విలన్ పాత్రే హైలెట్ అయినప్పటికీ, తెలుగులో మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి హీరో పాత్రనే హైలెట్ చేయించేలా స్క్రిప్ట్ మార్పించేశాడు. ఇక ఇప్పుడు సినిమాకు మరో అదనపు ఆకర్షణ తెచ్చేలా ఫ్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ పాత్రలో మెరవనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ బావబామర్దుల రిలేషన్ ఎంత స్ట్రాంగో తెలిసిందే. చెర్రీ కెరీర్ కోసం బన్నీ త్యాగం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఎవడు చిత్రంలో కూడా ఆ రోల్ చెర్రీ కోసమే చేశాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ధ్రువలో ప్రత్యేక పాత్రలో మెరిసేందుకు అర్జున్ ఎలాంటి అభ్యంతరం చెప్పడనే అనుకోవచ్చు. అయితే ఈ చిత్రంలో బన్నీ క్యారెక్టర్ ఏంటా అన్నది తెలియటం లేదు.
తనిఒరువన్ లో స్పెషల్ అప్పీరియన్స్ లాంటి హడావుడులు ఏం లేవు. సో... బన్నీ క్యారెక్టర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ కాకముందే, రోల్ ఏమయి ఉంటుందా అన్న డిస్కషన్ అప్పుడే మొదలైపోయింది. రకుల్ హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా స్వరాలు సమకూరుస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 7 న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more