లైంగిక వేధింపులకు చిన్నా పెద్ద అన్న తేడా ఉండదు. ఎవరైనా ఒకటే. సెలబ్రిటీలం అయినంత మాత్రానా రక్షణ ఉంటుందనుకుంటే పొరపాటే అంటూ ఈ మధ్య అనిల్ కపూర్ కూతురు సోనమ్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. అంతెందుకు తాను కూడా ఆ లిస్ట్ లో ఉన్నానని, చిన్నప్పుడు ఒకడు తన వక్షోజాలను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. ఓ స్టార్ హీరో కూతురు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేంట్రా అనుకున్నప్పటికీ అది మాత్రం వాస్తవమనే ఒప్పుకోవాలి.
ప్రస్తుతం మన దగ్గరే ఓ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ టాలీవుడ్ హీరోయిన్ చెల్లెలికి ఎదురయ్యే లైంగిక వేధింపుల హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఆరంగ్రేటం తెలుగు అయినప్పటికీ ఈ అచ్చ తెలుగు హీరోయిన్ కోలీవుడ్ లో కొన్నాళ్లూ టాప్ రేసులో దూసుకెళ్లింది. ఆ తర్వాత తెలుగులో ఓ నాలుగైదు సినిమాల్లో నటించి ఇక్కడా క్రేజ్ సంపాదించేసుకుంది. కానీ, ఆ తర్వాతే ఆమెకు అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అక్కడ, ఇక్కడా.. ఎక్కడా... అవకాశాలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె నటించిన ఒకే ఒక్క చిత్రం రీలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తుంది.
ఇదిలా ఉంటే ఆవిడగారి చెల్లెలు(కజిన్) ఓ ప్రముఖ ఛానెల్ లో యాంకర్. లో-ఫ్రోఫైల్ మెయింటెన్ చేసే ఆమెకు ఈ మధ్య వేధింపులు అధికం అయ్యాయంట. ఆమె వాట్సాఫ్ కి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపటమే కాదు, గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్ తో తెగ విసిగిస్తున్నారంట. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన లాభం లేకపోయిందంట.
దీంతో రంగంలోకి దిగిన సదరు యాంకర్ అక్క అయిన ఆ హీరోయిన్ పలువురు సినీ పెద్దల వద్ద విషయం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ వ్యవహారంలో సాయం చేయాలంటూ వారిని ఆమె కోరుతోందంట. అయితే ఇది బయటి వ్యక్తుల పని కాదని, ఛానెల్ లోని కొందరు కావాలనే చేస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది ఆ నటి సోదరి. మరి ఈ వ్యవహారం మీడియాకు చిక్కి అల్లరి కాకముందే గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించేందుకు యత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more