తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం మరోసారి మీడియాలో హడావుడి చేయబోతుందా? సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో మరికొందరి పేర్లు వెలుగులోకి రానున్నాయా? వారిని విచారించేందుకు ఎక్సైజ్ స్పెషల్ సిట్ సిద్ధమౌతోందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా మరో ముగ్గురు సినీ తారలకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. 11 మందిని విచారించిన సమయంలోనే వీరు మిస్సయ్యారని.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. వీరిలో ఓ టాప్ హీరోయిన్ సహా ఓ యువ నటి, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఘనంగా ఉన్న ఓ యంగ్ హీరో కూడా ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ వినియోగం విషయంలో ఈ ముగ్గురికి నేరుగా సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టాప్ హీరోయిన్ గురించే కథలు కథలుగా చెబుతున్నారు.
రీసెంట్ గా కూడా ఓ ఫంక్షన్ కు డ్రగ్స్ తీసుకుని వస్తే.. ఓ హీరో సాయంతో ఇంటికి చేరింది అని... కొన్ని వెబ్ సైట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే టాలీవుడ్ విచారణకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించటం విశేషం. తీవ్ర ఒత్తిడి రావటంతోనే సెలబ్రిటీల విచారణనను, మరి కొన్ని పేర్లు వెలుగులోకి రానివ్వలేదన్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో మరి కొందరి విచారణ పేరిట వస్తున్న వార్తలు పుకార్లే అనుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more