ఒక్క వ్యక్తి.. మొత్తం నాలుగు బయోపిక్ లు. ఆర్జీవీ, తేజ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ఎవరికి వారు తమ తమ వర్షన్ లలో మహానటుడు ఎన్టీఆర్ లైఫ్ ను తెరకెక్కిస్తామని చెప్పుకున్నారు. వీటిలో అసలు విషయాల కన్నా వివాదాలే ఇప్పటిదాకా ఎక్కువ వినిపించాయి.
అయితే తన తండ్రి చిత్రాన్ని ఎలాంటి తప్పిదాలు లేకుండా తెరకెక్కించే పనిలో పడ్డ బాలయ్య.. కాంట్రవర్సీల జోలికి పోకుండా సినిమాను తెరకెక్కించాలంటూ దర్శకుడు తేజకు ఇదివరకే సూచించాడు. అంతేకాదు సినిమాను తీయటంలో తన జోక్యం కూడా లేకుండా దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైపోయాడు. అయితే సినిమా ప్రారంభ విషయంలోనే ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా ఈ చిత్రాన్ని ఆ దివంగత నటుడి వర్థంతి జనవరి 18వ తేదీ మొదలుపెట్టాలని భావించారు. కానీ, వెంకీ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉండటంతో ఆ ఆలోచనను మార్చే పనిలో పడ్డాడు బాలయ్య. ఆ చిత్రం షూటింగ్ పూర్తయ్యేక ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టాలని తేజకు సూచించాడంట. ఇందుకోసం ఎన్టీఆర్ జయంతి మే 28వ తేదీని ఎంపిక చేసినట్లు సమాచారం.
ఆ రోజున గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చిత్రాన్ని ఫ్రారంభించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఆ లెక్కన్న చిత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more