సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భీమవరం బుల్లోడు'. సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థ యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విడుదలకు ముస్తాబు అవుతున్న ఈ చిత్రం Short Time (1990) అనే సినిమా ఆధారంగా రూపొందుతోందని తెలుస్తోంది.
పిరికివాడైన హీరో ఎలాగూ త్వరలో చనిపోతానని తెలుసుకుని లేని మొండి ధైర్యం తెచ్చుకుని సాహసాలు చేస్తాడు. సంఘ వ్యతిరేక శక్తులను ఎదిరిస్తాడు. అయితే తర్వాత తాను చావబోవటం లేదని, తను తప్పుడు మెడికల్ రిపోర్టులు అందుకున్నానని తెలుసుకుంటాడు. అప్పుడు అతినిలో నిజమైన భయం మొదలవుతుంది. ఈ విషయం తను మొండి ధైర్యంతో ఎదిరించిన విలన్స్ కు సైతం తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది మిగతా కథ.
ఇలాంటి కథే భీమవరం బుల్లోడులోనూ ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కాన్సర్ పేషెంట్ ని అనుకున్న సునీల్...మొండితనంతో సాహసాలు చేయటం...తర్వాత తనకు కాన్సర్ లేదని తెలిసి ఇరిక్కిపోవటం ఫన్నీగా ఉంటుందంటున్నారు. అయితే ఇది కరెక్టా కాదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందే.