తెలుగులో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’. వంద కోట్ల వ్యయంతో నిర్మాణం అవుతున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాణా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్లుగా అనుష్క, తమన్నా నటిస్తున్నారు. ఏడాదిన్నర పాటు షూటింగ్ జరుపుకున్న సినిమాగా ‘బాహుబలి’ చరిత్రకెక్కింది. ఈ మూవీ కోసం ప్రభాస్ మరే సినిమాను ఒప్పుకోకుండా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
శోభు యార్లగడ్డ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పట్లాగే జక్కన్న కధకు కీరవాణి రాగాలు అందించాడు. చరిత్ర నేపథ్యంగా వస్తున్న‘బాహుబలి’కి సెంథిల్ సినిమాటోగ్రాఫర్. అర్క మీడియా బ్యానర్ పై వస్తున్న ‘బాహుబలి’ కి జనార్ధన్ మహర్షి, మధన్ కర్కే మాటలు రాశారు. రెండు భాగాలుగా సినిమాను విడుదల చేసేందుకు సిద్దమైన యూనిట్.., తొలి పార్ట్ ను 2015 ఏప్రిల్ లో విడుదల చేస్తుంది.
కార్తిక్