వాణిజ్య ప్రకటనల ద్వారా బుల్లితెరపై తళుక్కుమన్న యామీ గౌతమ్.. తన మెరిసే అందంతో సినీ ఇండస్ట్రీలో అవకాశాలను రాబట్టుకుంది. మొదట హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. ఎన్నో భాషాచిత్రాల్లో ఈమె రెండేసి సినిమాల్లో నటించింది. దీంతో ఈమె యావత్ దేశంమొత్తం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ కి లేని ఫాలోయింగ్ ని సైతం ఈమె పొందింది. ఈ ఉత్తరాది బ్యూటీ అవకాశాలు మాట ఎలా ఉన్నా అభిమానులు గోల మాత్రం అధికంగానే ఉందట. ఇందుకు నిదర్శనంగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం తమిళ్ సెల్వమ్, తనియార్ అంజలుమ్ చిత్రంలో నటిస్తున్న యామి.. హిందీలో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాల షూటింగుల నేపథ్యంలో యామిని ఎంతగానో ఆరాధించే ఓ అభిమాని తనదైన శైలిలో ఆమెకి తన అభిమానాన్ని చాటిచెప్పాడట! యామి గౌతమ్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని.. రోజూ ఆమె షూటింగ్ జరిగే స్పాట్‌కు వెళ్లడం మొదలెట్టాడట. అతని ప్రవర్తన చూసిన కొందరు ప్రశ్నించగా.. తాను యామిని ప్రేమిస్తున్నానన్నది ఆమెకు తెలియాలని రోజు ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళుతున్నానని బదులిచ్చాడట. ఈ వీరాభిమాని వింత చేష్టలు మొత్తానికి యామి దృష్టికి చేరాయట. ఆశ్చర్యం, దిగ్భ్రాంతులతో కూడిన విస్మయానికి గురైన యామి ఇలాంటి చర్యలు బాధాకరం అంటూ అతనికి హిత వ్యాఖ్యలు చెప్పి పంపించే సిందట.
ఇలాంటి విపరీత చర్యలు చేసే అభిమానులు ఈ భామకు ఇదివరకు ఎంతోమంది తారసపడ్డారని చెబుతోంది. ఇంతకుముందొక అభిమాని తన అందమైన రూపాన్ని భారీ సైజ్ క్యాన్వాస్పై చిత్రీకరించి ఆమెను కలిసి ఆ పెయింటింగ్‌ను బహుకరించాడట. దానిని చూసి తాను ఎంతగానో మురిసిపోయానని ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరిచింది కూడా! అయితే ఇలాంటి అభిమానులను కలిగిన తనకు మంచి సినిమాల్లో నటించే అవకాశాలు మాత్రం ఎందుకు రావడం లేదని యామి తన సన్నిహితుల వద్ద వాపోతోందట. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చిన్నచిన్న సినిమాలే వున్నాయే తప్ప.. బాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటించే ఆఫర్లు మాత్రం రావడం లేదని ఆవేదన చెందుతోంది.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more