కళ్లతో అందాలను జుర్రుకునే ‘మైసూర్ బజ్జీ’ ఫస్ట్ లుక్..
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు. రాజబాబు, రేలంగి, పద్మనాభం నుంచి అల్లు రామలింగయ్య, సుత్తి బద్రర్స్.. అక్కడి నుంచి ఏవీఎస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వరకు అందరి నుంచి హాస్యాన్ని.. కాదు కాదు.. నవ్వించే తత్వాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం సినీమాల్లో తనదైన ముద్రవేసుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో వెన్నల కిషోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. సినీపరిశ్రమను ఏలిన ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, ఆహుతి ప్రసాద్ ఇలా కమేడియన్లు వరుసగా నవ్వుల్ని పంచి.. అవే జ్ఞాపకాలను…