వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ.. అనేక జంటలకు తమ దాంతప్య జీవితంలో పూర్తిస్థాయి సుఖం పొందలేదన్న అసంతృప్తి వుంటుంది. తమలో సెక్స్ కోర్కెలు తారాస్థాయిలో వున్నప్పటికీ.. రతిక్రీడలో పాల్గొనాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఉండదు. ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ ఆ కార్యం ముగించేస్తుంటారు. నిజానికి తమలో వున్న శృంగార కోర్కెలను తమ భాగస్వామితో చెప్పుకోవాలని ఇద్దరిలోనూ భావన వుంటుంది కానీ.. అలా చెప్పుకోవడం వల్ల తమ భాగస్వామి మానసిక ఇబ్బందులకు గురవుతారేమోనన్న భయంతో చెప్పుకోరు. కానీ.. సెక్సులో తనివితీరా ఎంజాయ్ చేయాలని కోరిక వుంటుంది.
ఈ విధమైన దంపతులకు సెక్స్ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సాధారణంగా.. సెక్స్ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు. సెక్స్ పుస్తకాలు చదవడం, సెక్స్ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.
భార్యాభర్తలు తమలో దాగివున్న శృంగార కోర్కెలను ఏకాంత సమయంలో పంచుకోవాలని, అలా చేయడం వల్ల ఇద్దరిలో వుండే మానసిక ఆవేదన చాలావరకు తగ్గుతుందని అంటున్నారు. గదిలో వున్నప్పుడు ఏమాత్రం బిడియం, సిగ్గు లేకుండా దంపతులిద్దరూ విచ్చలవిడిగా సెక్సులో పాల్గొనాలని, తమకు అనుకూలంగా వుండే రకరకాల భంగిమల్లో శృంగారం చేసుకోవాలని, అప్పుడే పూర్తిస్థాయి భావప్రాప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)