ట్రాఫిక్ పోలీసులు నల్లరంగు అద్దాలు కలిగిన వాహనాలపై విధించనున్న జరిమానాను నేటి నుంచి (సోమవారం) పెంచారు. కారు, బస్సులు నల్లరంగు అద్దాలతో తనిఖీల్లో పట్ట్టుబడితే రూ.500లు విధించనున్నారు. గత నెల 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు తనిఖీల్లో పట్టుపడిన వాహనా లకు నామమాత్రపు జరిమానా గా రూ.100 చలానా రాసి వదిలిపెట్టారు. కాగా వాహన దారుల్లో అవగాహన పెరగడం తోపాటు సుప్రీంకోర్టు ఉత్తర్వు లను అమల్లో పెట్టేందుకు నేటి నుంచి ట్రాఫిక్ పోలీసులు జరి మానాతోపాటు తనిఖీలను ముమ్మరం చేయనున్నారు.
దీనికి సంబంధించి ఇంతకు ముందు ప్రకటించినట్టుగానే ట్రాఫిక్ బాస్ సీవీఆనంద్ దూకుడు పెంచారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో 80శాతం మంది ఫిల్మ్ తొలగించారని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో సుమారు 4లక్షల వాహనాలు ఉంటే, వాటిలో 2 లక్షల 50 వేల వాహనాలకు నల్ల ఫిల్మ్ తొలగించారని ట్రాఫిక్ పోలీసలు నిర్ధారించారు. తొమ్మిది రోజుల్లో25,972 కేసులుట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 25వ తేదీ నుంచి 'నలుపు' తనిఖీలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి నవంబర్ రెండో తేదీ వరకు నగరంలో 25,972 కేసులు నమోదు చేశారు. వీటిలో ప్రభుత్వ, పోలీసుశాఖకు చెందిన 247 వాహనాలపై జరిమానాల విధించారు. 383 బస్సులు, ట్రక్‌లపై కేసులు రాశారు. ఈ తొమ్మిది రోజుల్లో విధించిన జరిమానాల ప్రకారం పోలీసు శాఖకు సుమారుగా రూ. 25లక్షల 97వేల 200ల ఆదాయం వచ్చిందని అంచనా. కాగా, మంత్రులు, ప్రముఖులు, ఎమ్మెల్యేలది ఆదినుంచి ఒకటే పట్టు.. తమకు మినహాయింపు ఇవ్వాలని!. ట్రాఫిక్ బాస్ మాత్రం ఇది కుదరదని , తమ చేతుల్లో ఏమీలేదని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అయినా వారంతా పట్టు విడవడంలేదు. దరఖాస్తుల మీద దరఖాస్తులు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలంటే హోం మంత్రి అధ్యక్షతన కూడిన కమిటీ పచ్చజెండా ఊపాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన కమిటీ ఇంకా పురుడు పోసుకోలేదు. వీలైనంత త్వరలో కమిటీని ఏర్పాటు చేయాలని సీవీఆనంద్ డీజీపీకి లేఖ రాశారని సమాచారం. కమిటీ ఏర్పాటైన తర్వాత అధికార బలాన్ని ఉపయోగించి మినహాయింపు పొందాలని యత్నించినా అది కుదిరే పనిగా కనిపించడంలేదు. జడ్, జడ్ ప్లస్ కేటగిరిలకు చెందిన వారికే మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ప్రకారం నలుపు నుంచి మినహాయింపునకు గల కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more