Rtc pushpak services in hyderabad

apsrtc, apsrtc pushpak services, rtc, in hyderabad, rtc metro service, pushpak buses,apsrtc, rtc city service, rtc buses, metro express, metro deluxe, gmr aero express

rtc pushpak services in hyderabad

13.gif

Posted: 12/14/2012 03:59 PM IST
Rtc pushpak services in hyderabad

pushpak_smal

       భాగ్యనగరవాసులకు విజ్ణప్తి... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ‘పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్’ ఏసీ బస్సులు ఇవాళ్టి నుంచి (శుక్రవారం) ప్రారంభమయ్యాయ్.  రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమానాశ్రయంలో ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభించారు.  15వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పుష్పక్ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
         కాగా, నగరంలోని 4 రూట్లలో 30 బస్సులు ప్రతి రోజు 220 ట్రిప్పులు తిరుగుతాయి. చక్కటి సీటింగ్ సదుపాయంతో, ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో తీర్చిదిద్దిన ఈ బస్సులు ప్రతి అరగంటకు ఒకటి చొప్పున తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తిప్పేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిని ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం వరకు నడుపుతారు. 
       దీంతో.. జీఎమ్మార్ సంస్థ ఎయిరో ఎక్స్‌ ప్రెస్ బస్సులను సైతం విరమించుకొనేందుకు అంగీకరించింది. ఎయిరో ఎక్స్‌ ప్రెస్ చార్జీల (రూ.230) కంటే తగ్గించి ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. మూడు శ్లాబుల్లో చార్జీలను ప్రకటించింది.
      ఇకనుంచి ఆర్టీసీ రూ.2000ల నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టింది. ఈ పాస్‌లతో పుష్పక్ బస్సుల్లోనే కాకుండా, మిగతా ఏసీ బస్సులు, మెట్రో ఎక్స్‌ ప్రెస్, మెట్రోడీలక్స్, ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. మూడు శ్లాబుల ప్రకారం రూ.200, రూ.150, రూ.100 చొప్పున చార్జీలు ఉంటాయి. ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రయాణం. 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు సగం చార్జీ (50 శాతం) ఉంటుంది. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని రవాణా మంత్రి బొత్ససత్యనారాయణ ప్రయాణీకులను కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Greater hyderabad budget
Crafts fair and exhibition in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more