ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త సంవత్సరం నుంచి జీహెచ్‌ఎంసీ వినూత్న సేవల్ని అందుబాటులోకి తేనుంది. ఒక్క ఫోన్‌కాల్‌తో ఫిర్యాదులు స్వీకరించి.. పరిష్కరించే అత్యాధునిక కాల్ సెంటర్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని సిటీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్ (సీఎంటీసీ)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ.. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఇది ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడంతో అత్యాధునిక కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు చెప్పారు.
ఈ సేవలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. జనవరి 1 నుంచి అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. మునుముందు ఫిర్యాదుల్నీ జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని, తద్వారా పరిష్కార ప్రగతిని తెలుసుకోవచ్చన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఫిర్యాదులు స్వీకరించే 155304 నెంబరే కొత్త కాల్‌సెంటర్ నెంబర్ కూడా. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఐడియా, రిలయన్స్, టాటా, యూనినార్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఒకటో తేదీ నాటికి సేవలు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్ సంస్థల తరహాలో 24 గంటలూ కాల్‌సెంటర్ పనిచేస్తుంది. ఈ కాల్‌సెంటర్ ఏకకాలంలో 16 ఫిర్యాదులు స్వీకరిస్తుంది. తొలిదశలో ఏకకాలంలో ఆరు కాల్స్ స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని వెలగని వీధిదీపాలు, ఫుట్‌పాత్‌లపై కుప్పలుగా నిర్మాణ వ్యర్థాలు, డంపర్‌బిన్ల నుంచి తొలగించని చెత్త, వీధికుక్కల స్వైర విహారం, మూతల్లేని మ్యాన్‌హోళ్లు, పొంగిపొర్లే వరదనీరు తదితర ఏ సమస్య గురించైనా ప్రజలు ఫోన్ చేయవచ్చు ఫోన్ ద్వారా ఫిర్యాదు అందగానే కాల్‌సెంటర్ నుంచి సంబంధిత విభాగానికి చేరుతుంది. సాధారణ సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేస్తారు. అనుమతి, పత్రాలు వంటివి పొందడానికి కావాల్సిన సమాచారం అందిస్తారు. ఏ పనికి ఎవరిని సంప్రదించాలో కూడా సూచిస్తారు. అంతేకాదు, ఫిర్యాదు- పరిష్కారం స్టేటస్‌ను సంబంధిత అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. జాప్యం జరుగుతుంటే కారణాలు తెలుసుకొని పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారమైనట్లు కంప్యూటర్‌లో నమోదు చేసినా.. నిజమని నిర్ధారించుకునేందుకు అధికారులు కూడా అడపాదడపా ఫిర్యాదుదారులకు ఫోన్‌చేసి వాకబు చేస్తారు.సమస్యలపై ఫిర్యాదుదారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం వస్తే సమస్య పరిష్కారమైనట్లు. లేని పక్షంలో అదే ఫిర్యాదును అధికారులు తిరిగి నమోదు చేస్తారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ వాసులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని. తమ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే వీలుకలుగుతుందని జిహెచ్ఎంసి అధికారులంటున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more