గుంటూరు నగరంలో జరిగిన సంపూర్ణ పారిశుధ్యంపై అవగాహన సదస్సుకు జేడీ లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం పారిశుధ్యంలో ప్రథమస్థానంలో ఉండాలని జేడీ పేర్కొన్నారు. కులం, మతం పేరుతో ప్రజలు విడిపోతున్నారని, ప్రజలను కలిపితే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల మద్య ఐక్యత సాధించాలని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసు విషయమై న్యాయస్థానాలు చూసుకుంటాయని సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. జగన్ అరెస్టు అంశం కోర్టు పరిధిలో ఉందని, ఆస్తుల కేసుపైన విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. విచారణ పూర్తి అయిన తర్వాతే చార్జీషీట్ దాఖలు చేస్తామని జేడీ స్పష్టం చేశారు. జగన్ అరెస్ట్ సక్రమమా, అక్రమమా అనేది కోర్టు తేల్చుతుందని అన్నారు. రాజకీయ ఆరోపణలపై తాము స్పందించమన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more