డబ్బు కోసం మర్డర్, ఆస్తి కోసం మర్డర్, ప్రేమలో మోసపోయిన వారు ఆత్మహత్య, జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్య, పరీక్షల్లో ఫేయిల్ అయితే ఆత్మహత్య, కుటుంబ కలహాలతో ఆత్మహత్య ఇలాంటి మనం చూశాం, విన్నాం, మన కళ్లముందు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ రోజు .. సొంత అక్క తమ్ముడు మద్య పోరు మొదలైంది. ఒకరు క్రికెట్ కోసం, మరోకరు సీరియల్స్ కోసం. టీవీ రిమోట్ కోసం గొడవపడ్డారు. వివాదం ముదిరిపోయి .. చివరకు తమ్ముడు పై పోరు చెయ్యలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. రిమోట్ ఇవ్వలేదనే కోపంతో ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన రిమోట్ మర్డర్ విని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడనివ్వలేదన్న మనస్థాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని అల్వాల్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మధుప్రియ, ఆమె తమ్ముడు టీవీ రిమోట్ కోసం ఘర్షణ పడ్డారు. క్రికెట్ మ్యాచ్ కోసం, సీరియల్ కోసం వీరిరువురు ఘర్షణ దిగారు. తమ్ముడు తనకు టీవీ రిమోట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన మధుప్రియ విషపు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధుప్రియ నగరంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇలాంటి రిమోట్ మర్డర్లు చాలా ఉన్నాయి. ఇంట్లో ఆడవాళ్లు కు, మగవారికి రిమోట్ దగ్గర గొడవలు పడి పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన జంటలు ఉన్నాయి. కొత్త మంది విడాకులు తీసుకున్న దంపతులు ఉన్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంఆ కుటుంబలో విషాదాన్ని నింపింది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more