రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించారని వైసిపి అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఈరోజు ఆయన జాతీయ మాట్లాడారు. విభజన విషయంలో సోనియా వ్యవహరించిన తీరు బాగోలేదని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం బాధాకరమన్నారు. సిఎం కు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసమే తాను దీక్ష చేస్తున్నానని స్పష్టం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో వివరించాలన్నారు. బాబు విభజనకు వ్యతిరేకంగా లేఖ రాస్తే సంతకం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా అందరూ కలిసి విభజనను ఆపాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో బుద్ధి చెబుతాం
సమైక్యాంధ్రకు మద్ధతుగా రాజీనామాలు చేయని నేతలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సమైక్యాంధ్ర కోరుతూ కొంతమంది మాత్రమే రాజీనామాలు చేశారని..మిగిలిన వారు కూడా రాజీనామాలు చేసి, ఆ కాపీని ప్రెస్ కు రిలీజ్ చేయాలని కోరారు. కొందరు రాజీనామాల డ్రామా ఆడుతున్నారని, అలాంటి వారి రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తామని హెచ్చరించారు. ఆందోళనల్లో భాగంగా ఉద్యోగ సంఘ నాయకులు దాడులకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. రహదారుల దిగ్భందం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత మాత్రమే నిర్వహించాలని కోరారు. తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మాత్రమే ఆందోళన చేస్తున్నామని, పదవుల కోసం కాదని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more