పండుగ రోజు తమ ఇంటికి ఆధారమైన పెద్దకొడుకు వస్తాడని ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి అతడి మరణవార్త శరాఘాతంలా తగిలింది. జమ్ము కాశ్మీర్ లో నిన్న పాకిస్థాన్ దళాల కాల్పుల్లో మరణించిన లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ మృతితో హైదరాబాద్ పాతబస్తీలోని నవాబ్ కుంట ప్రాంతంలోగల అతడి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబానికి పెద్దదిక్కు అతడే కావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. బక్రీద్ పర్వదినాన ఈ కుటుంబంలో ఆనందానికి బదులు విషాదం అలముకుంది. రెండు రోజుల క్రితమే ఫిరోజ్ ఖాన్ ఇంటికి ఫోన్ బక్రీద్ పండక్కి పిల్లలకు కొత్త దుస్తులు కొనమని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పండుగనాడు ఫిరోజ్ ఖాన్ వస్తాడని అందరూ ఎదురు చూశామని, తీరా అతడి మరణవార్త రావడంతో అంతా పరేషాన్ అయ్యామని అతడి సమీపం బంధువు ఒకరు చెప్పారు. ఫిరోజ్ ఖాన్ కు ముగ్గురు పిల్లలున్నారు. ఆ కుటుంబంలో ఇంకా ముగ్గురికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా అతడి మీదే ఉంది. నిన్న రాత్రి రెండు గంటలకు తమకు మొదటి సమాచారం వచ్చిందని, అప్పుడు కూడా బుల్లెట్ తగిలింది తప్ప ఏమీ కాలేదన్నారని, తీరా నిజం చెప్పమని గట్టిగా అడిగితే తర్వాత ఆర్మీలోని ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి ఫిరోజ్ ఖాన్ మరణించినట్లు చెప్పారని అతడి బంధువులు తెలిపారు. దీంతో వృద్ధురాలైన తల్లిని పట్టుకోవడం తమ తరం కావట్లేదని వాపోయారు. జమ్ము కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా మెంధార్ లోని హమీర్ పూర్ ప్రాంతంలో పాక్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే.
సిఎం దిగ్ర్బాంది
జమ్మూకాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో జవాను ఫిరోజ్ ఖాన్ మృతి పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఫిరోజ్ ఖాన్ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. రాత్రి 9 గంటలకు ఫిరోజ్ ఖాన్ బౌతిక కాయం హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more