జంటనగర్లో . దారిదొపిడి, దొంగతనలు శ్రుతిమించిపోతున్నాయి. నగర ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. నడిరోడ్డు పై నడిచి వెళ్లాలంటేనే.. భయపడే రోజులు నగరంలో చోటు చేసుకున్నాయి. పట్టపగలే.. నడి రోడ్డుపై దొంగతనాలు జరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గ్రిల్స్ తొలగించి బ్యాంక్ లోకి చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు వెళ్లారు.
ఈరోజు ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇక మల్కాజ్ గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఎంత మొత్తంలో నగదు, ఆభరణాలు చోరీకి గురైన వాటిపై విచారణ జరుపుతున్నారు.
50మంది అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్ పీఎఫ్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్బంగా మహిళా బోగీల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు భద్రత కరువైంది. నగరంలో ప్రయాణించే మహిళకకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీలలోనూ కొంత మంది పురుషులు ఎక్కి దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ డ్రైవ్ చేపట్టారు.
కాగా తమకు కేటాయించిన ప్రత్యేక బోగీలలో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయాలలో తాము ఎవరికి ఫిర్యాదు చేయాలని నగర మహిళ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైల్లో ప్రయాణించే మహిళలకు పోలీసుల రక్షణ కావాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more