ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చిలుకూరి బాలజీ టెంపుల్ ఒకటి. హైదరాబాద్ కి 30 కిలోమీటర్ల చిలుకూరు గ్రామంలో ఒస్మాన్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ప్రధాన దేవాలయంగా విరాజిల్లుతుంది. వాస్తవానికి ఈ ఆలయం పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి.అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నల పిన తండ్రులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు.
ఒక పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ భక్తులు పోటెత్తి వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు - తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more