హిందూ శాస్త్రాల్లో, పురాణాలలో రుద్రాక్షకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే.. రుద్రాక్ష శక్తిభరితమైందే కాదు.. ఔషదీగుణాలు కూడా కలిగి వుంటుంది. అందుకే పూర్వం రుషులు కూడా రుద్రాక్షతో తమ శరీర శోభన వృద్ధి చేసుకున్నారు. వీటిని కేవలం మనుష్యులే కాదు.. దేవతలు కూడా రుద్రాక్షను ధరించి, ధన్యులుగా భావించేవారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి సాక్షాత్తూ రుద్రునికి సమానమని పురాణాల్లో కూడా చెప్పబడింది.
పూర్వం ఋషులు కూడా ఈ రుద్రాక్షను ధరించి, కొన్ని వేల సంవత్సరాలవరకు తపస్సు చేసి, అనేక సిద్ధులు సంపాదించుకున్నారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి కూడా సమస్త పాపాలనుంచి విముక్తి చెంది మోక్షం పొందుతాడని ఆనాటి పూర్వకాలపు రుషులు పేర్కొన్నారు. అయితే వీటిని ధరించిడానికి కొన్ని ధార్మికమైన విధానం వుంది. విద్యుక్తంగా ధరించిన రుద్రాక్ష మహిమ.. సహస్ర అధికం అవుతుంది.
రుద్రాక్ష పరమశివుని భూషణం. అకాల మృత్యువుని జయించి, దీర్ఘాయువునిస్తుంది. గృహస్థులకు ఆర్థకామాలను.. సాధకులకు ధర్మమోక్షాలను ప్రసాదిస్తుంది. రుద్రాక్ష కేవలం ధార్మికంగానే కాదు.. ఆయుర్వేదిక - భౌతిక - సాధనాత్మక రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి దీనితో చికిత్స చేస్తారు.
రుద్రాక్షలోని రకాలు.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు :
1. ఏకముఖి : ఇది స్వయంగా బ్రహ్మ స్వరూపం. ఇది వున్నచోట లక్ష్మి నివసిస్తుంది.
2. ద్విముఖి : ఇది సాక్షాత్తు అర్థనారీవ్వర స్వరూపం. సర్వ కామప్రదం.
3. త్రిముఖి : ఇది అగ్నిస్వరూపం. దీనిని ధరించడంతో సంపద, తేజస్సు, ఆత్మబలం వృద్ధి చెందుతాయి. ఇది విద్యాదాత కూడా.
4. చతుర్ముఖి : ఇది కూడా సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం. ఇది ధర్మార్థ కామమోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తుంది.
5. పంచముఖి : ఇది సాక్షత్తూ రుద్ర స్వరూపం. అన్ని కోరికలు తీర్చి, సమస్త పాపాలను సంహరించి మోక్షం ప్రసాదిస్తుంది. 108 రుద్రాక్షలతో కూడిన మాలను ధరిస్తే విశేష ఫలం లభిస్తుంది.
6. షణ్ముఖి : ఇది కార్తికేయుని స్వరూపం. దీనిని కుడిభుజానికి ధరిస్తారు. బ్రహ్మహత్యలాంటి మహాపాపాలను కూడా ఇది పరిహరిస్తుంది.
7. సప్తముఖి : ఇది సప్తఋషి స్వరూపం. కంఠంలో లేదా కుడిభుజానికి ధరించవచ్చు. దీనిని ధరిస్తే.. దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు.
8. అష్టముఖి : ఇది అష్టభుజాదేవి స్వరూపం. దీనిని ధరించి అల్పుయువులకు ఆరిష్టం తొలగి, ధీర్ఘాయువు లభిస్తుంది.
9. నవముఖి : ఇది నవదుర్గా స్వరూపం. సిరిసంపదలను పొందడానికి దీనిని ధరిస్తారు.
10. దశముఖి : ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపం. అన్ని కోరికలను తీరుస్తుంది.
11. ఏకాదశముఖి : ఇది హనుమాన్ స్వరూపం. దీనిని ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తితోపాటు సర్వత్రా జయం లభిస్తుంది.
12. ద్వాదముఖి : ఇది ఆదిత్య స్వరూపం. దీనిని ధరించడంవల్ల నేత్రకాంతి వృద్ధిచెందడంతోపాటు.. మంచి బుద్ధి, ఆరోగ్యం కూడా పెంపొందుతాయి.
13. త్రయోదశముఖి : ఇది ఇంద్రుని స్వరూపం. అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి. అభీష్టప్రాప్తి కలుగుతుంది.
14. చతుర్దశముఖి : ఇది పరమశివుని స్వరూపం. దీన్ని ధరించడం ద్వారా సర్వదేవతల దయ లభిస్తుంది. సర్వపాపాలు తొలగి మోక్షం లభిస్తుంది.
15. గౌరీశంకర రుద్రాక్ష : ఇది పార్వతీపరమేశ్వర స్వరూపంగా వృక్షంతో కలిసి వుంటుంది. అభీష్టప్రాప్తి, సమృద్ధిని కలిగిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more