కథ -
పూర్వం ఒకానొక బ్రాహ్మణుని భార్య.. తన కుమారుణ్ణి జన్మనిచ్చి కన్ను మూసింది. ఆ బ్రాహ్మణుడు నిత్యంచేసే అగ్నిహోత్రాలు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, మరోసారి పెళ్లి చేసుకుంటాడు. కానీ రెండో పెళ్లి చేసుకున్న ఏడాదికే ఆ బ్రాహ్మణుడు కూడా వైకుంఠానికి చేరిపోతాడు. వితంతువైన రెండో భార్య, సవతి కొడుకూ కలిసే వుండసాగారు. కొన్నాళ్ళకు ఆ బ్రాహ్మణ బాలుడు వివాహం చేసుకున్నాడు. అయితే, తనకు పెళ్లయిన కొత్తలోనే వారిమధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ నూతన దంపతులకు సవతితల్లి ఏదోరకంగా వారి సుఖానికి అడ్డుపడుతూ వుండేది. ఈ పోరుపడలేక ఆ పిల్ల ఆత్మహత్యకు సిద్ధపడి, ఓ రాత్రి వేళ నదీతీరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో సహా విహారానికి వచ్చినవారు కనిపించారు. వారు ఆమె స్థితిని చూసి ప్రశ్నించగా.. బ్రాహ్మాణ వధువు తన కష్టం వారితో పంచుకుంటుంది. అందుకు వారామెను ఓదార్చి, వారి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని “నువ్వు గతంలో లక్ష్మీనారాయణ వ్రతం పట్టి ఉల్లంఘించినందుకే యీ జన్మలో బాధపడుతున్నావు. వెంటనే యింటికి వెళ్లి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ తీరతాయి"ని చెప్పారు. ఆమె అలాగే చేయగా సవతి అత్తగారు తన మనసు మార్చుకుని, తనకు లేని సుఖం తనసాటి ఆడపిల్లకైనా కలగాలని తలబోసి, కోడలినెంతో ఆదరంగా చూడసాగింది. భర్త కూడా ఆమెపట్ల అత్యధికమైన అనురాగంతో వుండేవాడు.
విధానం -
ప్రతీ ఏకదశినాడు ఉపవాసం వుండి, ద్వాదశినాడు ఉదయమే లక్ష్మీ నారాయణులను పూజించి, ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపి, అనంతరం బంధుమిత్రులతో కలిసి భుజించాలి.
ఉద్యాపనం -
అలా 24 పూజలయ్యాక, అంటే సంవత్సరం తరువాత, ఉద్యాపన చేసుకోవాలి. ఆరోజున తులసీ బృందావనం ఏర్పరచి, మండపం వగైరా నిర్మించి, వెండితో గాని, బంగారంతో గాని, లక్ష్మీ నారాయణ విగ్రహాలు చేయించి పూజించి, మండపం దానమివ్వాలి.
విశేషం -
ఈ లక్ష్మీ నారాయణుల నోము, మరో రెండురకాలుగా కూడా చెబుతారు. దీనిని కార్తీక శుద్ధ ఏకాదశినాడు ప్రారంభించి, తదుపరి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశితో ముగిస్తారు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more