పూర్వం ఒకరాజు కాంభోజ అనే దేశాన్ని రాజ్యమేలేవాడు. ఆ రాజు వృద్ధాప్య దశకు చేరుకుంటుండడంతో ఆ రాజ్యాన్ని తన వంశీయులకు అప్పగించే పనిలో పడతాడు. అతనికి కొడుకులు కూడా వుంటారు. కానీ వారు కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతుండటంవల్ల వారిలో తరువాత రాజు అయ్యేవారెవరో సతమతమవుతుండేవాడు.
ఒకరోజు తన రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు దర్శనమిస్తాడు. ఆ రాజు అతనిని సత్కరించి, అతిథి మర్యాదలు చేస్తాడు. కొద్దిసేపు అతనితో చర్చించిన తరువాత ఆ రాజు తన కుమారుల గురించి వివరిస్తాడు. వారు బాధపడుతున్న వ్యాధుల నుండి బయటపడేలా ఏదైనా పరిష్కారం సూచించమని ప్రాధేయపడ్డాడు.
దీంతో బ్రాహ్మణుడు దివ్య వ్రతం అయిన రథసప్తమీ వ్రతం గురించి ఆ రాజుకు వివరిస్తాడు. ‘‘మహారాజా! నువ్వు బాధపడకు. సర్వ పాపాల్నీ నాశనం చేసేది, అన్ని రోగాలనూ హరించేది, ఇష్ట కామ్యాలను తీర్చేదీ, అష్టయిశ్వర్యములనూ యిచ్చేదీ అయిన ఒక దివ్య వ్రతం ఉంది. అదే రథ సప్తమీ వ్రతం. దీన్ని స్ర్తీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చు. ఇప్పుడున్న నీ కుమారులలో యోగ్యుడెవడైతే వున్నాడో.. మొదట అతనితో ఈ వ్రతం చేయించు. అతడు వ్యాధినుంచి త్వరగా విమోచనం పొంది, రాజ్యపాలనలో పాల్గొంటాడు. ఆ తరువాత మిగిలిన వాళ్లతో ఈ వ్రతం చేయిస్తే వాళ్లు కూడా శ్రేష్ఠులవుతారు. యువరాజులుగా మారి అతడికి తోడ్పడుతారు’’ అని వివరంగా చెప్పాడు. దీంతో రాజుగారు చాలా సంతోషించి, అలాగే చేశాడు. రథ సప్తమీవ్రతాన్ని ఆచరించి రాజపుత్రులు ఆరోగ్యాన్ని పొందారు.
విధానం :
ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమినాడు నిర్వహిస్తారు. ఆరోజు ఉదయాన్నే లేచి తలలపై జిల్లేడాకులూ, రేగిపళ్ళు వుంచుకుని నదీ స్నానం చేసుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్న సూర్యదేవాలయానికి వెళ్లి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్నీ చేయించి ఇంటి వద్దనే ఆరాధించుకోవచ్చును. దీనికి ఉద్యాపనమంటూ లేదు. నిత్య జీవితంలో ప్రతీ ఏటా ఆచరించదగినది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more