జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినంనాడు కోయిలలు తమ రాగాలతో ఈ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మావిడిపిందెలు కూడా అంతకంటే ఉత్సాహంగా ఆహ్వానిస్తాయి. మావిచిగురు, వేపపూత, మల్లెల గుబాళింపులు, కోయిల కుహూరావం, పంచాంగ శ్రవణం వంటి ప్రతీదీ ఉగాదికి సంకేతాలనిస్తాయి. నందన నామ సంవత్సర వైభోగమంతా తెలుగువారి వాకిళ్ళలో తీర్చిదిద్దిన రంగవల్లికల్లో దర్శనమిస్తుంది. మావిడాకుల తోరణాల్లో ఒదిగి చూస్తుంది. పంచాంగ శ్రవణంలో ప్రతిధ్వనిస్తుంది. పిండివంటల్లో ప్రతిఫలిస్తుంది. ఉగాది పచ్చడి ఊరిస్తూ జీవన పరమార్థం బోధిస్తుంది.
ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఎలా నిర్వహించుకుంటారో.. తెలుగువారు ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటారు. అసలు ఉగాది అంటే ఏమిటో మీకు అర్థం తెలుసా? ఉగాది అనే పదం ‘యుగాది’ నుండి పుట్టుకొచ్చింది. ఉగాదిలో.. "ఉగ'' అంటే నక్షత్ర గమనం.. ''ఆది'' అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట. ''యుగము'' అంటే జంట అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనముల కలయికే సంవత్సరం.
అలా యుగానికి ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అయింది. మనం ఇప్పుడున్నది కలియుగం కాలంలో... అసలు కలియుగం అంటే ఏమిటో తెలుసా..? శ్రీకృష్ణుడు ఈ జగత్తును విడిచి వెళ్ళినప్పుడే కలియుగం ప్రారంభమైంది అంటూ వేదవ్యాసుడు ''యస్మిన్ కృష్ణో దివం వ్యాతః తస్మాత్ ఏవ ప్రతిపన్నం'' తనదైన శైలిలో వర్ణించాడు. ఆ విధంగా క్రీస్తుకుపూర్వం 3102 ఫిబ్రవరి 17/18 అర్ధరాత్రినాడు కలియుగం ప్రారంభమైంది.
ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతాఇంతా కాదు. ఆడపిల్లలు రంగురంగుల పరికిణీలు, చీరలు ధరించి, కాళ్ళకు పసుపు, తలలో మల్లెలు పెట్టుకుని పదహారణాల ఆడపడుచుల్లా ముస్తాబౌతారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. వేపపూత, మావిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారుచేసే ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు వంటి షడ్రుచులు మిళితమై ఉంటాయి.
ఈ షడ్రుచులను కోపం, ద్వేషం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు. జీవితంలో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండవని, మాధుర్యం మాత్రమే తొణికిసలాడదని, కష్టం, సుఖం కలగలిసి ఉంటాయని చెప్తుంది ఉగాది. దేనికీ పొంగిపోక, కుంగిపోక ప్రతిదాన్నీ సమదృష్టితో చూడాలని, అన్నిటికీ అతీతంగా ఉండాలనే సందేశాన్ని ప్రబోధిస్తుంది ఉగాది.
ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి, ఆనక ప్రసాదంగా తీసుకుంటారు. గారెలు, పాయసం, పులిహోర లాంటి ఇతర పిండివంటలనూ దేవునికి నైవేద్యంగా సమర్పించినప్పటికీ ఉగాది పచ్చడిదే అగ్రస్థానం. ఉగాది నూతన సంవత్సర వేడుకే కాదు, శోభాయమానమైన పర్వదినం. పల్లెల్లోనే గాక పట్టణాల్లోనూ తెలుగుతనం ఉట్టిపడుతుంటుంది..
ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆరోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా.. అతివృష్టి, అనావృష్టి లాంటివి ఉన్నాయా.. తుఫానులు, భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా.. దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటుచేసుకుంటాయి.
ఆయా రాశులకు గ్రహఫలాలను జ్యోతిష్య శాస్త్ర పండితులు క్షుణ్ణంగా వివరిస్తారు. ఉగాది పండితులకే కాదు, కవీశ్వరులకూ ఇష్టమైన పండుగ. సాంస్కృతిక సంస్థలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనాలు నిర్వహిస్తాయి. మంచి కవిత్వం చెప్పి అలరించినవారిని సత్కరించి సన్మానిస్తాయి.
మనది చంద్రమాన కాలెండర్ కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు. శక కాలెండర్ చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఇంగ్లిష్ నెలలను అనుసరించి చూస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణి వాళ్ళక్కూడా ఉగాది పర్వదినమే కొత్త సంవత్సరం. తెలుగువారికి నూతన జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more