The Old Saint Thirthas In Tirumala | Venkateswara temples | Hindu Dharmam

Tirumala old famous saint thirthas venkateswara temples

tirumala thirthas, Saint Thirthas, Saint Thirthas tirumala, tirumala temple, ram ravan story, hindu dharmam special

Tirumala Old Famous Saint Thirthas Venkateswara temples : The List Of Old Saint Thirthas Which Are Famous According To Hindu Dharma. These Are All in Tirumala.

తిరుమలలో వెలసిన ప్రాచీన పుణ్యతీర్థాలు..

Posted: 05/15/2015 07:14 PM IST
Tirumala old famous saint thirthas venkateswara temples

* పాండవ తీర్థము : కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన అనంతరం పాండవులు తమ బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేశారు. ఆ తర్వాత క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసునిని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్లే దీనిని ‘పాండవ తీర్థం’ అనే పేరు వచ్చింది.

* సనకసనందన తీర్థము : పూర్వం సనకసనందనాదులు ఈ స్థలంలో తపం ఆచరించి సిద్ధి పొందారు. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు.

* తుంబుర తీర్థము : పూర్వం ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలగడంతోపాటు సర్వపాపాలు కూడా నశిస్తాయి.

* చక్ర తీర్థం : భారత యుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. దీంతో ఈ తీర్థానికి చక్రతీర్థం అని పేరొచ్చింది. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు.

* జాబాలి తీర్థము : పూర్వం ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తపం ఆచరించి తరించారు. అందుకే దీనికాపేరు వచ్చింది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది.

* నాగతీర్థం : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు.

* బాల తీర్థము : నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. అయితే సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది.

* వైకుంఠ తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది.

* శేష తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరోజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. ఈ తీర్థం విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. అంతేకాదు.. కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి.

* సీతమ్మ తీర్థము : ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. అందుకే ఈ తీర్థానికి సీతమ్మ తీర్థమని పేరొచ్చింది. ఇక్కడ ఒక బిలం ఉంది. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.

* యుద్ధగళ తీర్థము : రావణుని రాముడు సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.

* విరజానది : ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తుంది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.

* పద్మసరోవరము : ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి.

కేవలం ఇవి మాత్రమే కాదు.. కుమారధార తీర్థం, కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saint Thirthas  Tirumala temple  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more