శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా.. దేవీ ఆరాధన బాలా త్రిపురసుందరితో మొదలవుతుంది. ఈ దేవి చిదగ్నికుండం నుంచి ఉద్భవించిందని చెప్పబడుతుంది. ఈమె త్రిపురాసురులను సంహరించటంలో మహాశివుడికి సహాయం చేసి, ఆయనతో సహా కొలువైన ప్రదేశమే ఈ త్రిపురాంతకం. ప్రకాశం జిల్లాలో వెలిసిన ఈ క్షేత్రం.. పూర్వం అనేక అద్భుతాల సమాహారం. అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీశైలానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలలాగా నాలుగు పుణ్య క్షేత్రాలున్నాయి. వాటిలో తూర్పువైపువున్న ద్వారం ఈ త్రిపురాంతక క్షేత్రము. శ్రీశైల క్షేత్రానికన్నా ఈ క్షేత్రం పురాతనమైనదని వేద, పురాణ, శాసనాధారాలవల్ల తెలుస్తోంది. శైవ సిధ్ధాంతం విలసిల్లిన ఈ క్షేత్రంలో అనేక విద్యాలయాలు వుండి, విద్యార్ధులకు అనేక విషయాలు బోధించేవారు. రసాయన విద్య, యోగ విద్య ఈ క్షేత్రంలో ఎక్కువగా వుండేవి. అంతేకాదు ఈ క్షేత్రంలో అనేక దివ్యౌషధాలున్నాయని రసరత్నాకర మొదలగు గ్రంధముల ద్వారా తెలుస్తోంది.
పురాణగాధ :
తారకాసురుని కుమారులైన తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు ముగ్గురూ తమ తండ్రి మరణానికి పరితపించి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సును మెచ్చుకుని ప్రత్యక్షం కాగా.. తమకు చావు వుండకూడదని వారు వరం కోరుకుంటారు. బ్రహ్మ జన్మించినవారికి మృత్యువు తప్పదని, ఏదో ఒక విధంగా మృత్యువునంగీకరించాలని చెప్పగా.. తాము మూడు పురములు కట్టుకుని ఆకాశంలో తిరుగుతూ వుంటామని, ఆ మూడు పురములు వరుసగా ఒకే చోటికి చేరినప్పుడు ఒకే బాణంతో ఆ పురాల్ని ఛేదించినవారి చేతిలో మాత్రమే తమకు మృత్యువు కలగాలని వరం కోరుకున్నారు. వారి వరాన్న బ్రహ్మ మన్నించగా.. తారాక్షుడు బంగారంతోనూ, విద్యున్మాలి వెండితోను, కమలాక్షుడు ఇనుముతోను మూడు పురాల్ని నిర్మిచుకుంటారు. బ్రహ్మ ప్రసాదించిన వర గర్వంతో దేవతలను, ఋషులను నానా బాధలు పెట్టసాగారు. వారంతా ఈశ్వరుణ్ణి ప్రార్ధించగా.. బ్రహ్మ వరము పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే అపూర్వ రధమూ, అపూర్వ బాణమూ కావాలని.. మీరవి సంపాదిస్తే నేను వారిని సంహరిస్తాను ఈశ్వరుడు అన్నాడు.
ఆయన ఆదేశంతో విశ్వకర్మ జగత్తత్వంతో రధాన్ని, వేదతత్త్వంతో గుర్రాలను, నాగతత్త్వంతో పగ్గాలను, మేరుశిఖర తత్త్వంతో ధనుస్సుని, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్త్వాలతో బాణాల్ని తయారుచేశాడు. ఆ రధానికి బ్రహ్మ స్వయంగా సారధి అయ్యాడు. అయితే త్రిపురాసురుల తపః ప్రభావంతో ఆ రధం భూమిలోకి కుంగిపోయి, గుర్రాలు నిలువలేకపోయాయి. అప్పుడు పరమేశ్వరుడు శక్తిని ధ్యానంచేశాడు. బాలాత్రిపురసుందరి ఆవిర్భవించి, తాను స్వయంగా ఆ ధనుస్సులో ఆవేశించింది. శక్తి సహాయంతో శివుడు త్రిపురాసుర సంహారంగావించాడు. ధనుస్సునుంచి బయటకి వచ్చిన బాలాత్రిపురసుందరికి ఆమె చేసిన సహాయానికి ఏమైనా కోరుకోమని శివుడు చెప్పగా.. స్వామి అక్కడే చిరకాలంవుండి తనని సేవించటానికి వచ్చే భక్తులకు స్వామిని కూడా సేవించే అవకాశం ప్రసాదించమని ఆమె కోరింది. బాలాత్రిపురసుందరి కోరికమీద అక్కడ కొలువైన స్వామి త్రిపురాంతకుడిగా, ఆ క్షేత్రం త్రిపురాంతకంగా ప్రసిధ్ధికెక్కింది.
ఆలయ విశేషాలు :
శ్రీ బాలా త్రిపురసుందరి ఆలయంలోని గర్భగుడే ఆ తల్లి ఆవిర్భవించిన చిదగ్నికుండం. ఇక్కడివారు దీనిని ‘నడబావి’ అంటారు. అమ్మవారి గర్భగుడికి వెళ్ళాలంటే 9 మెట్లు దిగాలి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఆవరణకి ప్రతీక. ఈ మెట్లకి అధిదేవత, ప్రత్యధిదేవతలున్నారు. ఈ మెట్లు దిగిన తర్వాత చిదగ్ని కుండంలో బిందు స్ధానంలో శ్రీ బాలా త్రిపురసుందరి విరాజిల్లుతోంది. ఆవిడ ఇక్కడ నిర్గుణ శిలాకారంలో ఉద్భవించింది. అయితే సామాన్యులు పూజించటానికి వీలుగా ఈ తల్లి ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. గర్భగుడికి ఎదురుగా వున్న మండపంలో శ్రీ చక్రమున్నది. ఈ మండపంలోనే శివ లింగం కూడా వుంది.
ఈ మండపం దాటి బయటకురాగానే, ఒక చిన్న మండపంలో శ్రీ ఛిన్నమస్తాదేవిని దర్శించవచ్చు. తన తలని చేతితో పట్టుకుని కొంచెం భీకరంగా వుండే ఈవిడ అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలిగా పిలువబడుతుంది. ఈవిడని ఆరాధిస్తే సకల సంపదలు, మంచి పాండిత్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. దేవిని కదంబ వనవాసిని అని కీర్తిస్తారు. కదంబ పుష్పాల పూజ ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనది. వర్షాకాలంలో అమ్మవారి విగ్రహం, ఆలయం చాలా భాగం వర్షపు నీటితో మునుగుతాయి. అప్పుడు అమ్మ పూజకి అంతరాయం రాకుండా బయట ఒక చిన్న ఆలయంలో కూడా అమ్మవారిని ప్రతిష్టించారు. ఈవిడని ‘అపరాధేశ్వరి’ లేక ‘బయట బాలమ్మ’ అంటారు. ఈ ఆలయానికి కొంచెం దూరంలోనే ‘ఆది శైలము’ అనే పర్వతం వుంది. కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత కొంతకాలం ఇక్కడ వున్నాడని ఈ పర్వతాన్ని కుమారగిరి అనసాగారు.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more