ఒలింపిక్స్‌లో జోడీగానే బరిలోకి దిగుతామని పట్టుబట్టిమరీ పంతం నెగ్గించుకున్న భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు మహేష్ భూపతి, రోహన్ బొపన్నకు వింబుల్డన్‌లో విషమపరీక్షను ఎదుర్కోబోతున్నారు. ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో గెలిస్తేనే వారికి పరువు దక్కుతుంది. ఒలింపిక్స్ కూడా ఈ గ్రాస్‌కోర్టుల్లోనే జరగనుండటంతో ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడటానికి వారికిది సువర్ణావకాశం. ఈ టోర్నీలో భూపతి, బొపన్న జోడీ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే ఒలింపిక్స్‌లో ఒకే జోడీగా బరిలోకి దిగాలనే తమ నిర్ణయం సరైనదేనని అందరినీ ఒప్పించగలుగుతారు. ఒకవేళ వారు విఫలమైతే తీవ్రంగా విమర్శలు చెలరేగుతాయి. అయితే, వారు ఈ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు దుబాయ్‌లో ఏటిపి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు మరో ఐదు టోర్నీల్లో సెమీస్‌కు చేరి సత్తా చాటారు. వీటిలో మూడు మాస్టర్స్ టోర్నీలున్నాయి. వింబుల్డన్‌లో ఈ జోడీ ఏడో సీడింగ్‌ను పొందింది. తొలిరౌండ్‌లో అన్‌సీడెడ్ జోడీ మార్సెల్ ఫెల్డర్, మాలెక్ జాజిరితో వారు తలపడతారు. కాగా, తన కంటే తక్కువ ర్యాంకు ఆటగాడిని ఒలింపిక్స్‌కు జోడీగా ఎంపికచేసినందుకు అసంతృప్తితో ఉన్న లియాండర్ పేస్ చెక్ రిపబ్లిక్‌కు చెందిన రాడిక్ స్ట్ఫోనెక్‌తో కలిసి ఈ టోర్నీలో ఆడుతున్నాడు.
అతడితో కలసి ఈ సీజన్ ప్రారంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకోవడం ద్వారా పేస్ కెరీర్‌శ్లామ్ పూర్తి చేసుకున్నాడు. అతడితో కలిసి మరో రెండు టైటిళ్లను కూడా నెగ్గాడు. ఈ జోడీ నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఓపెనింగ్‌రౌండ్‌లో అలెగ్జాండ్రొ ఫెల్లా, శాంటియాగో గిరాల్డో (కొలంబియా) జోడీతో తలపడుతుంది. కాగా, మిక్స్‌డ్‌డబుల్స్‌లో భూపతితో జోడీగా పాల్గొంటున్న సానియా మీర్జాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ సొంతం చేసుకున్న ఈ జోడీ లండన్ ఒలింపిక్స్‌లో కూడా కలిసే ఆడాలని అనుకుంటోంది. అయితే, సెలెక్టర్లు మాత్రం పేస్‌తో సానియాను జోడీగా ఆడించాలని నిర్ణయించారు. వింబుల్డన్‌లో భూపతి, సానియా మంచి ప్రదర్శన కనబరిస్తే సెలెక్టర్లు పనరాలోచనలో పడే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్‌కు మిక్స్‌డ్ డబుల్స్ ఎంట్రీలను పంపడానికి జులై 31 ఆఖరి రోజు. ఇందుకోసం జులై 23 వరకు ఉన్న ర్యాంకులను సీడింగ్ ఇవ్వడానికి పరిగణనలోకి తీసుకుంటారు. వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సానియా అమెరికాకు చెందిన బెతానీ మాటెక్ సాండ్స్‌తో కలిసి 13వ సీడ్‌ను పొందింది. ఈ జోడీ తొలి రౌండ్లో అలా కుద్రవ్‌ట్సేవా, స్లొయేన్ స్టీఫెన్స్ జోడీతో తలపడుతుంది.ఇలావుంటే లియాండర్ పేస్‌తో కలిసి ఆ డేది లేదని తెగేసి చెప్పిన భూపతి, బొపన్న ఈ టోర్నీలో రాణించలేకపోతే పరువు పోగొ ట్టుకోవడమేగాక, అఖిల భారత టెన్నిస్ స మాఖ్య (ఎఐటిఎ) తీసుకోబోయే చర్యలకు తల వంచాల్సి వస్తుంది
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more