భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన పురస్కారం దక్కింది. ఆస్ట్రేలియా పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా 'కు పరుగుల రారాజు సచిన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాని జూలియా గిలార్డ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 'ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య ఈ క్రికెటర్ గొప్ప బంధంగా నిలిచాడు. రెండు దేశాలు క్రికెట్‌తో ముడిపడినవి. సచిన్‌కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని దృవీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.' అని గిలార్డ్ పేర్కొంది. ఆస్ట్రేలియేతరులు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెంబర్‌గా ఎంపికకావడం అరుదైన విషయమని ఆమె తెలిపింది. మాస్టర్ ప్రత్యేకమైన క్రికెటర్ అని ఆమె ప్రశంసించింది. సచిన్ 190 టెస్టుల్లో 15,533 పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారతీయుడు సచిన్ కావడం విశేషం. కాగా, భారత్ నుంచి 2006లో అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీకి ఈ గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా-భారత్ దైపాక్షిక న్యాయ సంబందాలు మెరుగు పర్చినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 2009లో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారాకు ఈ గౌరవం దక్కింది. మరో విండీస్ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ 1985లో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా రాణి ఎలిజబెత్-2 1975లో 'ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా'ను ఏర్పాటు చేసింది. దేశానికి అత్యున్నత సేవలు అందించిన ఆస్ట్రేలియావాసులను ఈ అవార్డుతో సత్కరిస్తారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more