మన దేశంలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటకి ఉండదనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఒలంపిక్స్ లో పథకాల మీద పథకాలు సాధించిన మన హాకీ ఇండియా ఆటగాళ్ళకు ఇప్పుడు అంతంత మాత్రమే అధరణ ఉంది. వారి వచ్చే రెమ్యునరేషన్స్ కూడా తక్కువే. కానీ ఇప్పుడు వారి కష్టాలు తీరి పోయినట్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఐపీఎల్ నిర్వహించినట్లుగా హాకీ ఇండికా లీగ్ పేరుతో నిర్వహించబోతున్న టోర్నీలో భారత ఆటగాళ్ళ పంట పండింది. వివిధ ఫ్రాంఛైజీలు ఆటగాళ్ళను కొనడానికి పోటీ పడ్డాయి. భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కి అత్యథిక ధర లభించగా, రెండోస్థానం డ్రాగ్ ఫ్లిక్కర్ రఘునాథ్ సొంతం చేసుకున్నాడు. మరో స్టార్ డ్రాగ్ ప్లిక్కర్ సందీప్ సింగ్‌కు నిరాశ ఎదురైంది. అతడు రిజర్వ్ ధరకే అమ్ముడుపోయాడు. వేలంలో ఢిల్లీ వేవర్ రైడర్స్, ముంబయి మెజీషియన్స్, పంజాబ్ వారియర్స్, ఉత్తర్ ప్రదేశ్ విజార్డ్స్, రాంచీ రైనోస్, బెంగళూరు పాల్గొన్నాయి. ఈ లీగ్ జనవరి 17న ప్రారంభం కానుంది.
వేలంలో మొదటి స్థానంలో నిలిచిన సర్దార్ సింగ్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ 42.49 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. రఘునాథ్‌ను నాటకీయ పరిణామాల మధ్య సహారా ఉత్తరప్రదేశ్ జట్టు 41.40 లక్షలకు సొంతం చేసుకుంది. రఘునాథ్ కోసం ఢిల్లీ, యుపి జట్లు చివరిదాకా పోటీపడ్డాయి. అతని ప్రాథమిక ధర 7.56 లక్షలు కావడం గమనార్హం. సందీప్ ప్రాథమిక ధర 15.13 లక్షల మొత్తానికే ముంబయి దక్కించుకుంది. ఆస్ట్రేలియా డిఫెండర్ జో కరోల్‌ను 30.39 లక్షలకు కొనుగోలు చేసిన ముంబయి.. సందీప్‌ను చౌకధరకు దక్కించుకుంది. ఈ పరిణామాన్ని సందీప్ జీర్ణించుకోలేకపోయాడు. అత్యధిక ధరకు అమ్ముడయిన సర్దార్ సంతోషం వ్యక్తం చేశాడు. యువ డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ (ప్రాథమిక ధర 5.03 లక్షలు) ఊహించని ధర పలికాడు. రూపిందర్‌కు ఢిల్లీ 30.48 లక్షలు చెల్లించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more