భారత్ లో జరుగుతున్న ఇండో పాక్ సిరీస్ లో భాగంగా, మూడు వన్డేల సిరీస్ లో ఇవాళ మొదటి వన్డేలో భారత్ పాకిస్థాన్ పై ఓటమి పాలైంది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడిన జట్టను ధోని కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. అజేయ సెంచరీతో గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. టీమిండియా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని పాక్ 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఈ రోజు మళ్ళీ ఘోరంగా విఫలం అయ్యారు. గంభీర్ (8), సెహ్వాగ్(4), యువరాజ్(2), రోహిత్ శర్మ(4), కోహ్లి(0) విఫలం కావడంతో 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ని ధోని, అశ్విన్ ఆదుకొని కాస్తంత పరువు నిలుపుకున్నారు.
ఇక ఆరంభంలో తడబడిన పాక్ ను నాసిర్ జంషెద్, యూసిస్ ఖాన్ గాడిలో పెట్టారు. నాసిర్ జంషెద్ అజేయ సెంచరీ(101)తో రాణించాడు. యూనిస్ ఖాన్ అర్థ సెంచరీ(58) సాధించాడు. షోయబ్ మాలిక్ 34 పరుగులతో జంషెద్ కు జతగా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, దిండా చెరో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్థాన్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4 వికెట్టు నేలకూల్చాడు. ఇర్ఫాన్, హఫీజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.. ఈ సిరీస్ పాక్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో కోహ్లీకి గాయం అయింది. దీంతో రెండో వన్డేకి అడుతాడో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more